MLA Gadari Kishore Shocking Comments : కేసీఆర్ ను కాదు రేవంత్ ను ఉరి తీయాలి

మాజీ ఎమ్మెల్యే గ్యాద‌రి కిషోర్ కామెంట్స్

Hello Telugu - MLA Gadari Kishore Shocking Comments

Hello Telugu - MLA Gadari Kishore Shocking Comments

Gadari Kishore : హైద‌రాబాద్ – బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గ్యాద‌రి కిషోర్ (Gadari Kishore) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. మ‌తి త‌ప్పి మాట్లాడుతున్న సీఎంకు ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్పే రోజు ద‌గ్గ‌ర‌లోనే ఉంద‌న్నారు. రాద‌నుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ‌చ్చిన కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక అర్హ‌త రేవంత్ రెడ్డికి లేద‌న్నారు గ్యాద‌రి కిషోర్. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏమ‌న్నా తామంటే కేసీఆర్ ను ఉరి తీయాల‌ని ప‌దే ప‌దే అంటున్నాడ‌ని, ఆయ‌న‌ను కాదు ముందు రేవంత్ రెడ్డిని ఉరి తీస్తేనే కానీ తెలంగాణ‌కు ప‌ట్టిన శ‌ని పోతుంద‌న్నారు.

MLA Gadari Kishore Shocking Comments on CM Revanth Reddy

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడని ధ్వ‌జ‌మెత్తారు గ్యాద‌రి కిషోర్. గోదావరి జలాలు తెచ్చుడు అంత ఈజీ అనుకుంటున్నావా అని రేవంత్ రెడ్డి అంటున్నాడని, మరి మేము తీసుకు రాలేదా అని ప్ర‌శ్నించారు. అవును గోదావరి జలాలు తెచ్చుడు ఓటుకు నోటు కేసులో సూటు కేసు మోసినంత కష్టం అంటూ ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి, వైన్ షాపుల దొంగ మందుల సామేల్.. ఈ ఇద్దరు కలిసి జగదీష్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. రేవంత్ రెడ్డి క్లబ్బులకు పబ్బులకు రాను అని సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడని, అసలు నీ బతుకు మొదలైందే జూబ్లీహిల్స్ క్లబ్ నుండి కదా రేవంత్ రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు.

జూబ్లీహిల్స్ సొసైటీల ఫ్లాట్ తీసుకోని పక్కన ఫ్లాట్ ఓనర్లను బ్లాక్ మెయిల్ చేసి బతికినోడివి నువ్వు కాదా అని ప్ర‌శ్నించారు గ్యాద‌రి కిషోర్. రేవంత్ రెడ్డి 6 ఫీట్లు ఉన్నా, అమితాబ్ బచ్చన్ అనుకుంటున్నాడు గొట్టంగాడంటూ సీరియ‌స్ కామెంట్స్ చేశాడు.

Also Read : Ukraine New Prime Minister Exclusive : ఉక్రెయిన్ నూతన ప్రధానిగా స్వైరిడెంకో

Exit mobile version