Ex Minister Srinivas Goud Fired on Ministers : మంత్రుల కామెంట్స్ శ్రీ‌నివాస్ గౌడ్ సీరియ‌స్

మీరు ఇంత‌కు మ‌నుషులేనా అని మండిపాటు

Hello Telugu - Ex Minister Srinivas Goud Fired on Ministers

Hello Telugu - Ex Minister Srinivas Goud Fired on Ministers

Ex Minister Srinivas Goud : హైద‌రాబాద్ : మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్ (Ex Minister Srinivas Goud) నిప్పులు చెరిగారు. మంత్రులుగా బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ లు స్థాయి మ‌రించి ఒక భ‌ర్త‌ను కోల్పోయిన మ‌హిళ‌పై ఎలా నింద‌లు, కామెంట్స్ చేస్తారంటూ ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌వారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అస‌లు తుమ్మల నాగేశ్వరరావు అసలు మనిషేనా అని ప్ర‌శ్నించారు. త‌న‌కు మాన‌వత్వం అన్న‌ది లేకుండా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇవాళ ప‌ద‌వులు ఉంటాయి రేపు పోతాయి ఆ విష‌యం తెలుసుకుని మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు.

Ex Minister Srinivas Goud Slams Ministers

ప్రజల నుంచి వచ్చిన స్పందనతో త‌మ పార్టీ అభ్య‌ర్థి మాగంటి సునీత కన్నీళ్లు పెట్టారని దానిని కూడా త‌ప్పు ప‌డితే ఎలా అని మండిప‌డ్డారు వి. శ్రీ‌నివాస్ గౌడ్. కమ్మ సామాజికవర్గం వాళ్ళు ఓట్లు వేస్తే అదే సామాజికవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యారని మ‌రిచి పోవ‌ద్ద‌న్నారు. అదే సామాజికవర్గం ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నిక వచ్చిందని గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు. మాగంటి సునీత‌, త‌న బిడ్డ‌లు ప్ర‌చారం చేస్తే న‌టిస్తున్నారంటూ దారుణంగా కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు వి. శ్రీ‌నివాస్ గౌడ్. వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ప్ర‌జ‌లు కాంగ్రెస్ ను బొంద పెట్టే ప‌ని చేయ‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : Google Huge Investment in AP : ఏపీ స‌ర్కార్ తో గూగుల్ ఒప్పందం

Exit mobile version