Harish Rao Fired on CM Revanth : రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటి

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు

Hello Telugu - Harish Rao Fired on CM Revanth

Hello Telugu - Harish Rao Fired on CM Revanth

Harish Rao : హైద‌రాబాద్ : మాయ మాట‌లు చెప్ప‌డం , మోసం చేయ‌డం సీఎం రేవంత్ రెడ్డికి వెన్న‌తో పెట్టిన విద్య అన్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు (Harish Rao). చెప్పడమేమో ఒకటో తారీకు అందరికీ జీతాలు ఇస్తామని చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీ దవాఖానాలో పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలల నుంచి జీతం ఇవ్వ‌డం లేద‌న్నారు. కేవలం 60, 70 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని మండిప‌డ్డారు. ఇంకా 40 రకాల మందులు సప్లై కావ‌డం లేద‌న్నారు. పేషెంట్లను మాట్లాడితే కొన్ని మందులు ఇస్తున్నారు కొన్ని మందులు బయట కొనుక్కోవాలని చెప్తున్నారు అని అంటున్నార‌ని ఇలాగైతే ఎలా అని ప్ర‌శ్నించారు. మంగ‌ళ‌వారం శేర్ లింగంప‌ల్లి మండ‌లంలోని బ‌స్తీ ద‌వాఖానాల‌ను సంద‌ర్శించారు హ‌రీశ్ రావు. ఈ సంద‌ర్బంగా రోగుల‌ను ప‌రామ‌ర్శించారు.

MLA Harish Rao Slams CM Revanth Reddy

దేశంలోనే ఆనాడు కేసీఆర్ స‌ర్కార్ తొలిసారిగా బ‌స్తీ ద‌వాఖానాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.
టెస్టులలో B12 D3 టెస్టులకు రీఏజెంట్లు సప్లై లేకపోవడం వల్ల అన్ని రకాల టెస్టులు జరగడం లేద‌ని ఆరోపించారు. బస్తీ దవాఖానలో మందులు సరఫరా చేసే తెలివి ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ సిబ్బందికి జీతాలు వస్తున్నాయా లేదా అనే రివ్యూ చేసే తెలివి రేవంత్ రెడ్డి కి లేదా అని ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 108 సర్వీస్ సకాలంలో రాక పోవడం వల్ల, వైద్యం అందక పోవడం వల్ల మనిషి ప్రాణం పోయిందన్నారు. ముఖ్యమంత్రి తన గురించి ఆలోచించు కుంటాడు తప్ప ప్రజల గురించి ఆలోచించడ‌ని మండిప‌డ్డారు. హాస్పిటల్లో కేసీఆర్ కిట్టు ఇవ్వక పోవడం వల్ల 20% డెలివరీలు ప్రైవేటు ఆసుపత్రికి బదిలీ అయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ మీద కోపంతో పథకాలను బంద్ చేస్తే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : CM Revanth Reddy Interesting Comments : మావోయిస్టులు జ‌న జీవ‌న స్ర‌వంతిలోకి రావాలి

Exit mobile version