CM Revanth Reddy Interesting Comments : మావోయిస్టులు జ‌న జీవ‌న స్ర‌వంతిలోకి రావాలి

పిలుపునిచ్చిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

Hello Telugu - CM Revanth Reddy Interesting Comments

Hello Telugu - CM Revanth Reddy Interesting Comments

CM Revanth Reddy : హైద‌రాబాద్ : అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా ప్రధాన స్రవంతిలోకి వచ్చి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). గోషామహల్ స్టేడియంలో మంగళవారం జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. పోలీసు శాఖ నుండి గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. అమర వీరులకు నివాళులు అర్పించారు. మావోయిస్టు నాయకులు ప్రజా జీవితాన్ని శాంతియుతంగా నడిపించడానికి ప్రధాన స్రవంతిలోకి చేరాలని కోరారు. గోషామహల్ పోలీసు స్టేడియంలో జరిగిన పోలీసు సంస్మరణ దినోత్సవానికి సంబంధించి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జన జీవన స్రవంతిలోకి చేరి , పురోభివృద్దిలో పాలు పంచుకోవాల‌ని పిలుపునిచ్చారు సీఎం.

CM Revanth Reddy Comments

కొంత మంది కీలక మావోయిస్టు నాయకులు ఇటీవల లొంగి పోయారని మీ అందరికీ తెలుసు అన్నారు. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా ప్రధాన స్రవంతిలోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్రజా సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేసిన అధికారుల కృషిని త‌మ‌మ‌ ప్రభుత్వం గుర్తించింద‌ని అన్నారు. పోలీసు శాఖలోని అనేక కీలక విభాగాలలో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వడం ద్వారా తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ, జైళ్ల శాఖ, ఎస్ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్, ఆర్మ్‌డ్ రిజర్వ్, సిసిఎస్ , సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్ అధికారులు నాయకత్వం వహించడం మా ప్రభుత్వానికి గర్వకారణం అని ఆయన అన్నారు.

Also Read : Biocon Chief-DK Shivakumar Important Meet : డీకే శివ‌కుమార్ తో బ‌యోకాన్ చీఫ్ భేటీ

Exit mobile version