YS Jagan : అమరావతి – మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ తరపున త్వరలో యాప్ ను తీసుకు రానున్నట్లు వెల్లడించారు. సర్కార్ వేధింపులకు పాల్పడినా లేదా అక్రమంగా కేసులు నమోదు చేసినా, చెప్పకుండా అరెస్ట్ చేసినా వెంటనే తెలియ చేసేందుకు గాను దీనిని తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్యాయం జరిగిందని తెలిసిన వెంటనే ఈ యాప్ లో నమోదు చేయాలని సూచించారు మాజీ సీఎం. మంగళవారం జగన్ రెడ్డి (YS Jagan) మీడియాతో మాట్లాడారు.
YS Jagan Key Comments
వైసీపీ తరఫున త్వరలో యాప్ తెచ్చే ఆలోచన తనకు వచ్చిందని చెప్పారు. తాము అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు. కూటమి సర్కార్ పనిగట్టుకుని వేధింపులకు పాల్పడుతున్నట్లు వాపోయారు. ఈవిషయం పార్టీ అధినేత జగన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ సమయంలో యాప్ ఉంటే చాలు ఒక భరోసా కల్పించేందుకు శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వం వేధిస్తే వెంటనే యాప్‌లో నమోదు చేసేందుకు ఛాన్స్ ఉంటుందన్నారు.. అన్యాయం జరిగిన వెంటనే యాప్‌లో నమోదు చేయవచ్చంటున్న జగన్. పలానా వ్యక్తి, పలానా అధికారి కారణంగా ఇబ్బంది పడ్డానని యాప్‌లో ప్రస్తావించేందుకు తప్పకుండా ఉంటుందన్నారు.. ఆధారాలుగా ఉన్న వీడియోలు, పత్రాలు యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చని పేర్కొన్నారు.. కంప్లైంట్ ఆటోమేటిక్ గా వైసీపీ డిజిటల్ సర్వర్‌లోకి వచ్చేస్తోందన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ ఫిర్యాదులపై కచ్చితంగా పరిశీలన చేస్తామన్నారు.
Also Read : HYDRAA Commissioner Shocking : దేవుడి పేరుతో కబ్జాల పర్వం కమిషనర్ ఆగ్రహం
















