EPFO : న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యత్‌కు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగుల సేవలను మరింత వేగంగా, సులభంగా అందించాలన్న లక్ష్యంతో ఈపీఎఫ్ఓ ఇటీవల అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది.
EPFO New Updates
ఇటీవల జారీ చేసిన తాజా మార్గదర్శకాల్లో భాగంగా, EPF ఖాతాదారులు నివాస అవసరాల కోసం తమ ప్రావిడెంట్ ఫండ్‌లోని మొత్తం 90 శాతం వరకు ఉపసంహరించుకునే అవకాశం కలిగించారు. ఇదంతా పేరా 68-BD అనే కొత్త నిబంధన కింద అమలవుతోంది. ఇప్పటివరకు ఐదు సంవత్సరాల సభ్యత్వం ఉండాల్సి వచ్చినా, ఇప్పుడు కేవలం మూడు సంవత్సరాల సభ్యత్వంతోనే ఈ సదుపాయం పొందవచ్చు.
ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు ఎలా ఉండేవి?
ఇంతకు ముందు హౌస్ లోన్, ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణలు చేయాలంటే కనీసం ఐదేళ్ల సభ్యత్వం తప్పనిసరి. అలాగే ఉద్యోగి, యజమాని కలిపిన ఫండ్ మొత్తాన్ని 36 నెలల వేతనానికి పరిమితం చేసేవారు. అయితే తాజా మార్పుతో ఇంటి కొనుగోలు చేస్తున్న వారికి ఒక్కసారిగా అధిక మొత్తాన్ని ఉపసంహరించే అవకాశం లభిస్తోంది. కానీ, ఈ సదుపాయం జీవితంలో ఒకసారి మాత్రమే వినియోగించుకునేలా రూపొందించారు.
ఇతర ముఖ్యమైన మార్పులు
- తక్షణ ఉపసంహరణ: వచ్చే జూన్ 2025 నుంచి UPI లేదా ATM సౌకర్యం ద్వారా సభ్యులు అత్యవసర అవసరాల కోసం తక్షణమే రూ. 1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండనుంది.
- ఆటో సెటిల్మెంట్ పరిమితి: ఆటోమేటిక్ క్లెయిమ్ పరిమితి ఇప్పటి వరకు రూ. 1 లక్షగా ఉండగా, దాన్ని రూ. 5 లక్షలకు పెంచారు.
- సరళీకృత ధృవీకరణ: క్లెయిమ్ ప్రాసెస్‌లో అవసరమైన ధృవీకరణల సంఖ్యను 27 నుంచి 18కి తగ్గించారు. దీనివల్ల 3-4 రోజుల్లోనే క్లెయిమ్ ప్రాసెస్ అవుతోంది.
- విద్య, వివాహ, వైద్య అవసరాల కోసం ఉపసంహరణలు: ఈ అవసరాల కోసం ఉన్న క్లెయిమ్ ప్రక్రియలను మరింత సరళీకరించారు. దీని వల్ల ఆర్థిక ద్రవ్యత పెరిగి సభ్యులకు తక్షణ సాయం అందుతోంది.
మొత్తం మీద…
EPFO తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఉద్యోగులకు ఆర్థికంగా భద్రతను కలిగించడమే కాకుండా, సేవల ప్రాప్తిని వేగవంతం చేస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని డిజిటల్ మార్పులు కూడా చోటు చేసుకోనున్నాయని సమాచారం.
Also Read : Trump Tarrif Sensational : మరోసారి సుంకాల మోత షురూ చేసిన ట్రంప్..ఆయా దేశాలకు 30%
