Tirumala Strict Security : తిరుమ‌ల‌లో భ‌క్తుల కోసం భద్ర‌త క‌ట్టుదిట్టం

ఎల్ అండ్ టి సంస్థ ప్రతినిధులతో టీటీడీ ఈవో సమీక్ష‌

Hello Telugu - Tirumala Strict Security

Hello Telugu - Tirumala Strict Security

Tirumala : తిరుమల – భక్తుల సౌకర్యార్థం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలలో (Tirumala) భద్రతను క‌ల్పించేందుకు యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌ని ఆదేశించారు టీటీడీ ఈవో జె. శ్యామ‌ల రావు ఆదేశించారు. ఇందుకు సంబంధించి అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ భద్రతా వ్యవస్థను మరింత ఆధునీకరించడంలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక భద్రతా సదుపాయాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

Tirumala Strict Security

ఇందులో భాగంగా అలిపిరి తనిఖీ కేంద్రం ఆధునీకరణ, అధిక సామర్థ్యం కలిగిన స్కానర్లు, త్వరితగతిన తనిఖీలు పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పార్కింగ్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ కంట్రోల్, ఇంటిగ్రాటెడ్ సర్వేలన్స్ సిస్టం, కామన్ అలారం మానేజ్మెంట్ సిస్టం, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ, నో హెల్మెట్ డిటెక్షన్, ఆటోమెటిక్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ క్లారిఫికేషన్, కమాండ్ కంట్రోల్ వ్యవస్థ వంటి అంశాలను ఈవోకు సవివరంగా వివరించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 40 ఏళ్లకు సరిపడా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. అదే విధంగా దీర్ఘ కాలిక, స్వల్ప కాలిక ప్రణాళికలు రూపొందించాలని స్ప‌ష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సీవీఎస్వో ముర‌ళీ కృష్ణ‌, సిఈ సత్య నారాయణ, ఎల్ అండ్ టి ప్రతినిధుల నిపుణుల బృందం, ట్రాన్స్ పోర్ట్ మరియు IT జీఎం శేషారెడ్డి, ఏఎస్పీ రామకృష్ణ, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, శ్రీమతి సదా లక్ష్మీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Also Read : TTD EO Interesting Review : శ్రీవారి సేవలో మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం

Exit mobile version