‘ఏంద‌య్యా సామి’ సాంగ్ సంచ‌ల‌నం

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక ర‌ణ‌బ‌లి

hellotelugu-RanaabaliYendayyaSami

హైద‌రాబాద్ : రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, నేష‌న‌ల్ క్ర‌ష్ రష్మిక మందన్న కలిసి నటిస్తున్న చిత్రం ‘రణబలి’. ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో ఇప్పటికే దీనిపై ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్ర బృందం మరో అప్‌డేట్‌ను అందిస్తూ సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రకటించింది. ఇదిలా ఉండ‌గా ప్రేక్ష‌కుల్లో మ‌రింత ఉత్సాహాన్ని పెంచుతూ చిత్ర బృందం ఈ సినిమాలోని ఏంద‌య్యా సామి
అనే పూర్తి పాటను విడుదల చేసింది. విడుదల సమయానికి ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ‘రణబలి’ సినిమా రూపొందుతోందని సమాచారం. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ యోధుడి పాత్రలో కనిపించనున్నారు.

చాన్నాళ్ల త‌ర్వాత విజయ్, రష్మికల కలయిక ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి వివాహం జరిగిందన్న వార్తల తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో అభిమానులు దీనిపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్ , అతుల్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను టి-సిరీస్ సమర్పిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తాజాగా ర‌ణ‌బ‌లి నుంచి విడుద‌లైన ఈ పాట ఇప్పుడు యూత్ ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ ఇద్ద‌రి కెమిస్ట్రీ, న‌ట‌న సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇందుకు ద‌ర్శ‌కుడు రాహుల్ సాంకృత్య‌న్ ను అభినందించ‌క త‌ప్ప‌దు. అంత‌కు ముందు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి గీత గోవిందం మూవీలో న‌టించింది. ఇది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. దీనికి ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Exit mobile version