హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 9 అని ఈసీఐ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. 2026 ఏప్రిల్ 9 నాటికి ఖాళీ అయ్యే రెండు రాజ్యసభ స్థానాలకు మార్చి 16న తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. ఇద్దరు ఎంపీలు డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి , కేఆర్ సురేష్ రెడ్డిల పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీ తో ముగుస్తుందని పేర్కొన్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తెలంగాణలో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడమే కాకుండా, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా , హిమాచల్ ప్రదేశ్‌లలో 37 స్థానాలకు ఈసీఐ ఎన్నికలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.
