Ranya Rao Shocking : న‌టి ర‌న్యా రావుకు షాక్.. రూ. 34 కోట్ల ఆస్తులు జప్తు

ఇప్ప‌టికే 14.7 కిలోల బంగారం స్వాధీనం

Hello Telugu - Ranya Rao Shocking

Hello Telugu - Ranya Rao Shocking

Ranya Rao : బెంగ‌ళూరు – ప్ర‌ముఖ కోలీవుడ్ న‌టి ర‌న్యా రావుకు (Ranya Rao) బిగ్ షాక్ త‌గిలింది. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఊహించ‌ని ఝ‌ల‌క్ ఇచ్చింది. దుబాయ్ నుండి బంగారం అక్రమ రవాణా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయింది బెంగ‌ళూరు ఎయిర్ పోర్టులో. క‌స్ట‌మ్స్ (డీఆర్ఐ) అధికారుల త‌నిఖీల్లో ఊహించ‌ని రీతిలో కిలోల లెక్క‌న బంగారం ల‌భించింది. ఆమె ఎవ‌రో కాదు గ‌తంలో క‌ర్ణాట‌క రాష్ట్రంలోని పోలీస్ శాఖ‌లో అత్యున్న‌త‌మైన ప‌ద‌విలో ఉంటూ రిటైర్ అయిన పోలీస్ ఆఫీస‌ర్ కూతురే ఈ ర‌న్యా రావు.

Actress Ranya Rao Properties Seized

త‌ను కొన్ని క‌న్న‌డ సినిమాల‌లో కూడా న‌టించింది. ప‌లు ఈవెంట్ల‌ల త‌ళుక్కున మెరిసింది. అంతే కాకుండా బెంగ‌ళూరు ఎయిర్ పోర్టు నుంచి లెక్క‌కు మించి దుబాయ్, ఇత‌ర దేశాల‌కు ప్ర‌యాణం చేసిన‌ట్లు గుర్తించారు. అనుమానం వ‌చ్చిన అధికారులు ఉన్న‌ట్టుండి ర‌న్యా రావును అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ‌లో భాగంగా విస్తు పోయే నిజాలు తెలిశాయి. త‌ను అక్ర‌మంగా బంగారాన్ని , ఇత‌ర వ‌స్తువుల‌ను ఇక్క‌డికి తెస్తున్న‌ట్లు గుర్తించారు. ఈ సంద‌ర్బంగా తాజాగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ (ఈడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

బెంగుళూరులోని రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఇప్పటికే రన్యారావు దగ్గర నుండి 14.7 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. మ‌నీ లాండ‌రింగ్ కింద ర‌న్యా రావుపై కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు. ప్ర‌స్తుతం న‌టి జైలులో ఉంది. ఆమె అస‌లు పేరు హ‌ర్ష‌వ‌ర్దిని ర‌న్యా. త‌న వ‌య‌సు 32 ఏళ్లు. గ‌త మార్చి 3వ తేదీన కెంపెగౌడ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో త‌న‌ను అరెస్ట్ ఏసింది డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ). రూ. 12.56 కోట్ల విలువైన బంగారు క‌డ్డీల‌ను స్వాధీనం చేసుకుంది.

Also Read : Allu Aravind Shocking : బ్యాంకు స్కామ్ లో అల్లు అర‌వింద్ విచార‌ణ

Exit mobile version