ED : ఏపీ, తెలంగాణ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దూకుడు పెంచింది. మెడికల్ కాలేజీ అడ్మిషన్లు, అనుమతులలో జరిగిన అవకతవకలపై తన దర్యాప్తును విస్తరించింది, వరంగల్‌లోని కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తో పాటు విశాఖపట్నంలోని గాయత్రి మెడికల్ కాలేజీకి సంబంధించిన సంస్థలపై సోదాలు నిర్వహించింది.
ED Shocking Searches
కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా వరంగల్‌లోని కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రాంగణంలో సోదాలు నిర్వహించినట్లు ఈడీ నిర్దారించింది. మేనేజ్‌మెంట్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న డి. విజయ్‌పాల్ రెడ్డి, కొలంబో ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ తరుణ్ రెడ్డి, వరంగల్ డియోసెస్ ఛాన్సలర్ ఫాదర్ జోసెఫ్ కోమర్ రెడ్డితో సహా కొలంబో గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థల నిర్వహణను దర్యాప్తు ఏజెన్సీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున దర్యాప్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన వ్యవహారాలను పరిశీలించింది.
ఫాదర్ జోసెఫ్ కోమర్ రెడ్డి ఇప్పటికే సిబిఐ కేసును ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఈడీ దర్యాప్తు కేంద్ర సంస్థ మునుపటి ఎఫ్‌ఐఆర్‌తో సోదాలు చేపట్టింది. ఈ సంస్థతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణకు చెందిన మధ్యవర్తి అంకం బాబుపై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. అదే దర్యాప్తులో భాగంగా హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నంలలో గాయత్రి మెడికల్ కాలేజీకి సంబంధించిన ప్రదేశాలతో సహా సోదాలు జరిగాయి.
Also Read : DK Shivakumar Important Update : సీఎం మార్పుపై పార్టీ హైకమాండ్ దే ఫైనల్
