Betting Apps Case Sensational : బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ కేసులో 29 మందిపై కేసు

అంతా ప్ర‌ముఖులు..సెలిబ్రిటీస్..ఇన్ఫ్యూయన్స‌ర్స్

Hello Telugu - Betting Apps Case Sensational

Betting Apps : హైద‌రాబాద్ – బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్స్ కేసులో బిగ్ అప్ డేట్ వ‌చ్చింది. వీటిని ప్ర‌మోష‌న్స్ చేసినందుకు గాను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఏకంగా 29 మంది ప్ర‌ముఖుల‌పై కేసు న‌మోదు చేసింది. పబ్లిక్ జూదం చట్టం 1867ను ఉల్లంఘించి, అక్రమ బెట్టింగ్ (Betting Apps) ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించినందుకు గాను సినీ సెలిబ్రిటీస్, ఇన్ఫ్యూయ‌ర్స్, ప్ర‌ముఖులకు ఝ‌ల‌క్ ఇచ్చింది. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలలో కేసులు న‌మోద‌య్యాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు జ‌రిపింది.

Betting Apps Case Updates

నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, ప్రణిత సుభాష్, మంచు లక్ష్మి, , టీవీ హోస్ట్‌లు శ్రీముఖి, శ్యామల వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్ , లోకల్ బోయ్ నాని వంటి యూట్యూబర్‌లు కూడా పరిశీలనలో ఉన్నారు. జంగ్లీ రమ్మీ, A23, జీట్‌విన్, పారిమ్యాచ్, లోటస్365, ఇతరుల వంటి ప్లాట్‌ఫామ్‌ల ఎండార్స్‌మెంట్‌లు చెల్లింపు ప్రమోషన్ల ద్వారా పెద్ద మొత్తాలను లాండరింగ్ జ‌రిగిన‌ట్ల ఈడీ ప్ర‌క‌టించడం క‌ల‌క‌లం రేపింది.

ఫణీంద్ర శర్మ, వినయ్ వంగల వంటి వ్యక్తుల నుండి వచ్చిన ఫిర్యాదులు జూదం అలవాట్లపై ఈ ప్రమోషన్ల ప్రత్యక్ష ప్రభావాన్ని ఉదహరించారు. మరో ఫిర్యాదుదారు పులి కుమార్ రెడ్డి యూట్యూబ్ ప్రకటనల కారణంగా రూ.3 కోట్లకు పైగా నష్టపోయారని నివేదించారు. భారీ ఎత్తున సినీ, ఇన్ ఫ్యూయ‌ర్స్ పాల్గొన‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది ప్ర‌జ‌ల నుంచి.

Also Read : X CEO Linda Shocking to Musk : ఎక్స్ సిఈవో లిండా యాకారినో రిజైన్

Exit mobile version