ECI Important Update : బీహార్ అసెంబ్లీ, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్

విడుద‌ల చేసిన కేంద్ర ఎన్నిక‌ల సంఘం

Hello Telugu - ECI Important Update

Hello Telugu - ECI Important Update

ECI : ఢిల్లీ : కేంద్ర ఎన్నిక‌ల సంఘం (సీఈసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సోమ‌వారం బీహార్ రాష్ట్రంలో శాస‌న స‌భ ఎన్నిక‌ల‌తో పాటు హైద‌రాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. రెండు ద‌శ‌ల్లో బీహార్ లో శాస‌న స‌భ ఎన్నిక‌లు చేప‌డ‌తామ‌ని తెలిపింది. ఇందులో భాగంగా నవంబర్ 6న మొదటి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ నిర్వ‌హిస్తామ‌ని పేర్కొంది. ఇదే స‌మ‌యంలో నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జ‌రుగుతుంద‌ని తెలిపింది ఈసీ. ఇదిలా ఉండ‌గా ఉప ఎన్నిక‌కు గాను అక్టోబ‌ర్ 13న నోటిఫికేష‌న్ జారీ చేస్తామ‌ని , 21 వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఈనెల 22న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు ప‌రిశీలిస్తామ‌ని పేర్కొంది. కాగా ఈనెల 24న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అని ప్ర‌క‌టించింది.

ECI Key Updates

ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది జూన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా ఉప ఎన్నిక తప్పనిసరి అయింది జూబ్లీ హిల్స్. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుందని భారత ఎన్నికల సంఘం (ECI) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.99 లక్షలు. ఇందులో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. సెప్టెంబర్ 2న విడుదలైన ప్రారంభ జాబితాలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,92,669. నవీకరణ తర్వాత, 6,976 మంది ఓటర్లు జోడించగా, 663 మందిని తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య 3,98,982 అయింది.

Also Read : Popular Actor Kamal Haasan : క‌రూర్ లో ప‌ర్య‌టించ‌నున్న‌ ఇల‌య నాయ‌గ‌న్

Exit mobile version