Eatala Rajender : హుజూరాబాద్ – బీజేపీలో ఎంపీల మధ్య మాటల యుద్దం కలకలం రేపింది. ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా నమ్ముకొని అబద్దాల పునాదుల మీద కొంతమంది బ్రతుకుతున్నారని అన్నారు. నాది స్ట్రెయిట్ ఫైట్, స్ట్రీట్ ఫైట్ ఉండదన్నారు. ధీరుడుతో కోట్లాడతాం.. కుట్రదారులతో కాదన్నారు. ఈ కుట్రలు ఛేదించే సత్తా ప్రజలకే ఉంటుందని, మనం చిన్న వాళ్ళమన్నారు. నేను బేజాప్తా కాదు బాజప్తా యుద్ధం చేసేవాడినని అన్నారు. చరిత్ర లేకుండా వర్తమానం లేదు. వర్తమానం లేనిది భవిష్యత్తు లేదన్నారు.
MP Eatala Rajender Key Comments
స్వేచ్ఛ కోసం బానిస సంకెళ్లు బద్దలు కొట్టడం కోసం ఉరికంబాలు ఎక్కారు, తూటాలకు బలయ్యారు. వారు అందించిన ఫలాలలోనే మనం జీవిస్తున్నామని చెప్పారు ఈటల రాజేందర్ (Eatala Rajender). కొంతమంది వెకిలిగాళ్ళు ఇంకెక్కడ తెలంగాణ ఉద్యమం అంటున్నారు. కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో మేము చేసిన ఉద్యమం ఇంకా మా గుండెల్లో ఉందన్నారు. 78 గంటల పాటు ఉత్తర దక్షిణ భారతదేశం మధ్య రైళ్లు నిలిపి వేసినం, ఫైరింగ్ చేస్తా అంటే ఛాతీ చూపింది మేం అన్నారు.
చైతన్యం, ముక్కుసూటి తనంతో బరిగీసి కోట్లాడిన గడ్డ హుజురాబాద్ గడ్డ. అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నా. సాహసంతో ఉద్యమాల విజయం సాధించిన గడ్డ ఇది. మానుకోట ఉద్యమం చేసింది హుజురాబాద్ ప్రజలు. భార్య భర్తలు గుర్తుకు వస్తె ఇంటికి పోండి అన్నా పోకుంటా ఉన్నారు. మా శ్యామ్ కి బుల్లెట్ తగిలింది. బ్రతికిస్తే మళ్ళీ ఉద్యమం కోసం కోట్లాడతాం అని చెప్పిన వారు మా వాళ్ళు. మేము అక్కడినుండి వచ్చిన వాళ్ళం. ఏమనుకుంటున్నారని అన్నారు.
తెలంగాణ కోసం అనేక అవమానాలు దిగ మింగుకున్నాం. కానీ పదవుల కోసం పెదవులు మూయ లేదన్నారు. మంత్రిగా ఉండి కూడా GHMC RTC కార్మికులకు మద్దతు తెలిపిన వాడు ఈటల . ఈ సిఎంతో కొట్లాడితే ఇక్కడ ఉండలేం అని తెలిసి కూడా కోట్లడిన. 2021లో తీసివేశారు. వందల సంఖ్యలో నాయకులు అమ్ముడు పోయినా..దళిత బంధు, గోర్లకు డబ్బులు ఇచ్చినా.. ఆరు నెలల ఎన్నికల ప్రచారం చేసిన కొట్లాడిన. తెలంగాణ ఆత్మ గౌరవం గెలిచింది. అప్పుడే యావత్ తెలంగాణలో ఒక ఆలోచన మొదలైందన్నారు.
నా ముఖం ప్రజల గుండెల్లో ఉందన్నారు. శామీర్ పేట భారతీయ జనతా పార్టీ అడ్డా. ఇక్కడ ఎంపీనీ నేను. రేపటి గెలుపునకు సంకేతం ఇచ్చే అడ్డా. ఎవడో సైకో, శాడిస్ట్ ఏదో పెడుతున్నారు.. వాడు ఎవడు, ఏ పార్టీ వాడు, ఎవరి అండతో సోషల్ మీడియాలో పెడుతున్నారు. బీ కేర్ ఫుల్ కొడక అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Also Read : Ex Minister Srinivas Goud Fired on CM : చంద్రబాబును అడుక్కుంటున్న రేవంత్ రెడ్డి


















