Pawan Kalyan : అమరావతి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశానికి మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత హాజరయ్యారు. మరో వైపు సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల (Pawan Kalyan) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్. ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పేర్కొన్నారు.
DY CM Pawan Kalyan Key Comments on Montha Cyclone
గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగులను గుర్తించి సురక్షిత ప్రదేశాలకు తరలించి వైద్య సేవలు అందించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలని అన్నారు డిప్యూటీ సీఎం. పునరావాస కేంద్రాలకు వెళ్లిన ప్రజల ఇళ్లకు భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. మొంథా తుపాను ప్రభావం, సహాయక చర్యలపై కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ, అధికార యంత్రాంగంతో ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.
Also Read : Puducherry Govt – New Innovation : అందుబాటులోకి 25 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు
