Pawan Kalyan : చిత్తూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. నాలుగు కిలోమీటర్లకు పైగా అడవిలో పర్యటించారు. ఆపై రెండు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి ప్రతి చెట్టును తనిఖీ చేశారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురు వంటి చెట్లతో పాటు శేషాచలంలో మాత్రమే కనిపించే అరుదైన వృక్ష జాతులను కూడా పరిశీలించారు. వాటి గురించి అటవీ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని వాచ్‌టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు పవన్ కళ్యాణ్వెలిగొండ–శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణముఖి నది ఉద్భవ స్థానం వంటి అంశాలపై ఆరా తీశారు.
DY CM Pawan Kalyan Important Visit
అంతే కాకుండా గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చొని చుట్టూ ఉన్న పరిసరాలను బైనాక్యూలర్ ద్వారా తిలకించారు. వాగు ఇరువైపులా ఉన్న చెట్లపై వివరాలు తెలుసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా, స్మగ్లింగ్ నిరోధక చర్యలు, టాస్క్ ఫోర్స్ కార్యకలాపాలు, అటవీ సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్లపై ప్రత్యేకంగా తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ కొణిదల. తమ ప్రభుత్వం ఎర్ర చందనం స్మగ్లింగ్ ను ఒప్పుకోదని స్పష్టం చేశారు. ఎవరైనా సరే ఇక నుంచి స్మగ్లింగ్ మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లేకపతే ఆపరేషన్ కగార్ తరహాలో మిమ్మల్ని ఏరి వేస్తామని పేర్కొన్నారు. ఇకనైనా మానుకోవాలని సూచించారు. ఇదే సమయంలో నలుగురు స్మగ్లింగ్ కు పాల్పడుతున్న కింగ్ పిన్ లను గుర్తించామన్నారు. వారి తాట తీస్తానని హెచ్చరించారు.
Also Read : RGV- Hero Chiranjeevi : ‘శివ’కు మెగాస్టార్ అభినందన ఆర్జీవీ క్షమాపణ
