Pawan Kalyan : విశాఖపట్నం – ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్, అందాల తార నిధి అగర్వాల్ కలిసి నటించిన చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన ఈవెంట్ లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్, నటుడు రఘు బాబు, స్టార్ మేకర్ సత్యానంద్, ఎమ్మెల్ఏలు పల్లా శ్రీనివాస్ రావు, సుందరపు విజయకుమార్, పంచకర్ల రమేష్ బాబు, వంశీ కృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, మేయర్ పీలా శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
DY CM Pawan Kalyan Key Comments
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడుతూ తనకు విశాఖ గుండెల్లో వుంటుందన్నారు. 1992 లో స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద నటనలో శిక్షణ కోసం విశాఖ వచ్చానని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర యాసలో పాట పాడి అభిమానులను అలరించారు. నోవాటెల్ లో వున్నపుడు తనను అరెస్ట్ చేయాలని చూశారని అన్నారు. గత ప్రభుత్వం హయంలో టికెట్ రేట్లు పెంచక పోయిన భీమ్లా నాయక్ సినిమా హిట్ అయిందన్నారు. ఈ సినిమా హిట్ అవ్వాలని ట్వీట్ చేసిన మంత్రి లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు.
హీరోయిన్ నిధి అగర్వాల్ ను చూసి సిగ్గు పడి ప్రమోషన్ లలో పాల్గొంటున్నానని తెలిపారు. తనకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలీదన్నారు. అన్యాయం జరిగితే ఎదురు తిరగాలి అన్న ధ్యేయం ఉండేది అన్నారు. సత్యానంద్ తనకు జీవిత పాఠాలు నేర్పారని చెప్పారు. భీమిలి, ద్వారకా నగర్ ప్రాంతాలలో నట శిక్షణ సాగింది అన్నారు. వచ్చే ఏడాది 30 ఇయర్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాను అన్నారు. ఖుషి వంటి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చిన నిర్మాత ఏ ఏం రత్నం చెప్పిన కథ విని ఒప్పుకున్నట్లు తెలిపారు.
ఈ సినిమా కొన్ని కారణాల చేత ఆలస్యం అయింది అని పేర్కొన్నారు. దర్శకుడు క్రిష్ తప్పుకున్న తర్వాత నిర్మాత రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమా బాగా తెర కెక్కించారు అన్నారు. ప్రజలు, సినిమా ఇచ్చిన ధైర్యంతోనే నియంతృత్వ వైసీపీ ప్రభుత్వాన్ని దించేశాం అన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి లేకుంటే ఈ సినిమా లేదని చెప్పారు. తన సినిమాలు వినోదం తో పాటు విజ్ఞానం కూడా ఇస్తాయి అన్నారు. కోహినూర్ వజ్రం నేపథ్యంలో కల్పిత పాత్ర హరి హర వీరమల్లు తో సినిమా నడుస్తుంది అన్నారు. సనాతన ధర్మం ఇతర మతాలకు వ్యతిరేకం కాదు అని స్పష్టం చేశారు.
Also Read : AP Heavy Rains – IMD Alarming : కుండపోత వర్షం జర భద్రం – ఐఎండీ

















