DY CM Pawan Kalyan Important Update : ఆలయాల్లో భక్తుల భద్రతపై దృష్టి సారించాలి

స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

Hello Telugu - DY CM Pawan Kalyan Important Update

Hello Telugu - DY CM Pawan Kalyan Important Update

Pawan Kalyan : అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల (Pawan Kalyan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల కాశీబుగ్గ శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై స్పందించారు. సోమ‌వారం ఆయ‌న స‌మీక్ష చేప‌ట్టారు. కార్తీక మాసం రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్రముఖ క్షేత్రాలు అన్నవరం, పాదగయ పిఠాపురం, పంచారామం సామర్లకోటతోపాటు ఇతర ఆలయాల్లో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల‌ని ఆదేశించారు. దేవాదాయ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు నిర్వహించాలని అన్నారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని స్ప‌ష్టం చేశారు.

Deputy CM Pawan Kalyan Key Comments

క్యూ లైన్ల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్, ఎస్సీలను ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలో ప్రముఖ శైవ క్షేత్రాలయిన సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం శ్రీ పాద గయ, అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయాలతో పాటు పలు ప్రధాన ఆలయాల్లో కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులకు పుణ్య క్షేత్రాలు, దేవాలయాలలో ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

Also Read : CM Chandrababu Important Meet : పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో చంద్ర‌బాబు భేటీ

Exit mobile version