CM Chandrababu Important Meet : పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో చంద్ర‌బాబు భేటీ

లండ‌న్ ప‌ర్య‌ట‌నలో ఏపీ సీఎం బిజీ బిజీ

Hello Telugu - CM Chandrababu Important Meet

Hello Telugu - CM Chandrababu Important Meet

CM Chandrababu : యుకె : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) లండ‌న్ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ఏపీలో సంభ‌వించిన మొంథా తుపానును ఎదుర్కోవ‌డంలో స‌క్సెస్ అయ్యారు. యావ‌త్ దేశానికి ఆద‌ర్శ ప్రాయంగా నిలిచారు త‌న ప‌రిపాల‌నా అనుభ‌వంతో. ప్ర‌త్యేకించి కొత్త‌గా వ‌చ్చిన సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అత్య‌ధికంగా ఉప‌యోగించుకున్న సీఎంగా నిలిచి పోయారు. ఇదిలా ఉండ‌గా త‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి సామాజిక ప‌రంగా చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా అవార్డుకు ఎంపిక‌య్యారు. ఈ సంద‌ర్బంగా త‌న భార్య‌తో క‌లిసి సీఎం లండ‌న్ లో ప‌ర్య‌టించేందుకు విచ్చేశారు. లండన్ లో వివిధ పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జర్లాడ్ తో సమావేశం అయ్యారు.

CM Chandrababu Meeting

ఇదే స‌మ‌యంలో హిందుజా గ్రూప్ భారత చైర్మన్ అశోక్ హిందుజా, యూరోప్ లోని హిందుజా గ్రూప్ చైర్మన్ ప్రకాశ్ హిందుజా, హిందుజా రెన్యువబుల్స్ ఫౌండర్ శోమ్ హిందుజా లతో చ‌ర్చించారు. రోల్స్ రాయస్ గ్రూప్ సీటీఓ నిక్కి గ్రేడి స్మిత్ తో భేటీ అయ్యారు నారా చంద్ర‌బాబు నాయుడు. స్రామ్,ఎమ్రామ్ గ్రూప్ చైర్మన్ శైలేష్ హిరనందానీతోను కీల‌క స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. శామ్కో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయ తో భేటీ అయ్యారు. లండన్ లోని పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.

Also Read : Singer Chinmayi Fired on Jani Master : జానీ మాస్ట‌ర్, కార్తీక్ ల‌పై చిన్మ‌యి శ్రీపాద ఫైర్

Exit mobile version