హైదరాబాద్ : హైదరాబాద్ లోని అసెంబ్లీకి దగ్గరలోనే ఉంది ద్వారకా గ్రాండ్ హొటల్. నిత్యం పనుల మీద, అవసరాల నిమిత్తం ఎందరో వస్తుంటారు. నిత్యం సందడిగా ఉంటుంది. ధరల మోత మోగిస్తూ వినియోగదారుల నుండి పెద్ద ఎత్తున వసూలు చేస్తున్న ఈ హోటల్ యాజమాన్యం పరిశుభ్రతను పాటించడాన్ని గాలికి వదిలి వేసింది. ద్వారకా గ్రాండ్.. కిచెన్ చూస్తే రోగాలకు ద్వారంలా కనిపిందింది ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీలో. దుర్గంధం వెదజల్లుతున్నట్లుగా వంటగది ఉండడంతో ముక్కు మూసుకున్నారు. గడువు దాటినా ఇంకా వడ్డిస్తున్న ఆహార పదార్థాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.
పైగా మూడు పిల్లులు కిచెన్ రూమ్ అంత కలియ తిరుగుతూ అక్కడే అవసముంటున్న పరిస్థితి.పేరు గ్రాండ్ అని పెట్టి ఏమాత్రం శుభ్రత లేని ఆహార పదార్థాలను జొమాటో ద్వారా సప్లై చేయడం విశేషం. కిచెన్ లో వాతావరణం చూసి అవాక్కయిన తనిఖీ అధికారులు. నిన్న సైబరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకా గ్రాండ్ హోటల్ లో తనిఖీలు చేశారు. ఔట్ డేటెడ్ ఫుడ్ మెటీరియల్ పై నిర్వాహకులకు నోటీస్ ఇచ్చారు. నిబంధనలకు అనుగుణంగా కిచెన్ లో మార్పులు చేసేవరకు మూసివేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా ఈ మధ్యన రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల ఇదే వ్యవహారం కనిపిస్తోంది. కొన్ని హొటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు చాలా వరకు శుభ్రతను పాటించడం లేదని తనిఖీలలో తేలి పోయింది. దీంతో నోటీసులు జారీ చేస్తున్నారు.


















