YSR : హైదరాబాద్ – దివంగత , ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి. సరిగ్గా ఇదే రోజు సెప్టెంబర్ 2న ఆయన కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో కూలిన హెలికాప్టర్ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన పూర్తి పేరు యేదుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా పులివెందులలో జూలై 8, 1949లో పుట్టారు. రాజశేఖర్ రెడ్డి (YSR) తొలి విద్య పులివెందులలో చదివాడు. ఎం.ఆర్. మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివి డాక్టర్‌గా మారారు. 1978లో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. చరిత్ర సృష్టించారు.
YSR Death Anniversary Today
2003లో 1,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల మనసులు గెలుచుకున్నారు డాక్టర్ వైఎస్ఆర్. 2004లో కాంగ్రెస్ పార్టీని విజయం దిశగా నడిపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2009లో మళ్లీ విజయం సాధించి రెండోసారిగా సీఎంగా కొలువు తీరారు. ఆయన తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ప్రజాదరణ పొందారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య శ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. రైతులకు 7 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు ఉచిత విద్యుత్ స్కీం తీసుకు వచ్చారు రెడ్డి. పేదలకు గృహ నిర్మాణం చేపట్టేందుకు ఇళ్ల నిర్మాణానికి శ్రీాకారం చుట్టారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీటి సదుపాయం కల్పించేందుకు జలయజ్ఞం తీసుకు వచ్చారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో ఆర్థిక సాయం అందించేందుకు ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని తెచ్చారు.
Also Read : YS Jagan – YSR Death Anniversary : సంక్షేమ ప్రదాత అభివృద్ది విధాత
