హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు , ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ పరువు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. రేపిస్టుకు ఎలా స్వాగతం పలుకుతారంటూ ఆయన ప్రశ్నించారు. మైక్రోసాఫ్ట్ అధినేత, బిల్ గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ బిల్ గేట్స్ ను ఏకి పారేశారు. ఏం అర్హత ఉందని ఇండియాకు, ఏపీకి వచ్చారంటూ ప్రశ్నించారు. తనపై అత్యాచార ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున విమర్శలు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో బిల్ గేట్స్ ను ఏపీకి నారా చంద్రబాబు నాయుడు , లోకేష్ లు ప్రత్యేకంగా ఆహ్వానించడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో కేఏ పాల్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
ఎవరైనా రేపిస్టుకు స్వాగతం పలుకుతారా అని నిలదీశారు. అసలు చంద్రబాబుకు సిగ్గు అనేది ఉందా అని ఫైర్ అయ్యారు డాక్టర్ కేఏ పాల్. ఇదే సమయంలో బిల్ గేట్స్ పై కూడా నిప్పులు చెరిగారు. గేట్స్ ఫౌండేషన్ వ్యాక్సిన్లతో దేశం తీవ్రంగా నష్ట పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్ స్టీన్ తో బిల్ గేట్స్ కి సంబంధాలున్నాయని సంచలన ఆరోఫణలు చేశారు డాక్టర్ కేఏ పాల్. చంద్రబాబు బిల్ గేట్స్ కి ఎందుకు రెడ్ కార్పెట్ వేస్తున్నాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బిల్ గేట్స్ కో హటావ్ .. దేశ్ కో బచావ్ అంటూ నినదించారు.
