పెళ్లికి ముందు ఎవరినీ నమ్మొద్దు : సుప్రీంకోర్టు

ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

hellotelugu-SupremeCourt

న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పెళ్లిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. పెళ్లికి ముందు ఎవ‌రినీ న‌మ్మ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించింది. శారీర‌క సంబంధాలు ముందుగా పెట్టుకోవ‌డం మంచిది కాద‌ని పేర్కొంది. అలా పెట్టుకోవ‌డం వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించింది. జీవితంలో ఏదైనా ముఖ్యమైన బంధాన్ని ఏర్పరుచుకునే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది ధ‌ర్మాస‌నం. పెళ్లికి ముందే శారీరక సంబంధంలోకి ఎలా వెళ్తారో అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. జీవితంలో ఏదైనా ముఖ్యమైన బంధాన్ని ఏర్పరుచుకునే విషయంలో చాలా అప్రమత్త‌త అవ‌స‌ర‌మ‌ని స్పష్టం చేసింది.

వివాహానికి ముందు అంగీకారంతో శారీరక సంబంధంపై ప్రశ్నించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్న వ్యక్తి బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ ల ధర్మాసనం విచారించింది. నిందితుడి బెయిల్ కేసులో భాగంగా ఫిర్యాదుదారురాలిని.. దుబాయ్‌ కు ఎందుకు వెళ్లావు, అక్కడ శారీరక సంబంధం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సంద‌ర్బంగా పెళ్లికి ముందు ఇలాంటి సంబంధాలు తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతాయ‌ని పేర్కొంది. ఇత‌రుల‌కు ఆద‌ర్శ ప్రాయంగా ఉండాలే త‌ప్పా ఇలాంటి చ‌వ‌క‌బారు చ‌ర్య‌ల వ‌ల్ల తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని హెచ్చ‌రించింది.

Exit mobile version