Donald Trump : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. అలెస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఉక్రెయిన్ పై ఏకపక్షంగా చేస్తున్న దాడులను ఆపాలని కోరారు. దీనికి కొంచం ఆలోచించుకుని సమాధానం చెబుతానని హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు రష్యా చీఫ్. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు తాను కృషి చేస్తున్నట్లు వెల్లడించారు . ఉక్రెయిన్ కు మద్దతుగా ఇప్పటి వరకు పంపించిన ఆర్మీ దళాలను వెనక్కి రప్పిస్తామని, ఇదే సమయంలో ఇక నుంచి తమ ఆర్మీని పంపించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు ట్రంప్. ఇరు దేశాలు సయోధ్య కుదుర్చు కోవాలని లేకపోతే ఎక్కువగా ఉక్రెయిన్ కు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా దేశ అధ్యక్షుడు.
Donald Trump Shocking
రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ను రక్షించడానికి సహాయం చేయడానికి US దళాలను పంపబోమని హామీ ఇచ్చారు. నాటోలో చేరడం, రష్యా నుండి క్రిమియన్ ద్వీపకల్పాన్ని తిరిగి పొందాలని ఉక్రెయిన్ ఆశ పడటం మానుకోవాలని సూచించారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ, ఇతర యూరోపియన్ నాయకులు వైట్ హౌస్‌లో గంటల తరబడి చర్చలు జరిపారు. చర్చలు ముగిశాక ఉక్రెయిన్ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడారు. ట్రంప్ చేసిన సూచనలు తాము పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. రష్యా అకారణంగా, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తమపై దాడులకు పాల్పడిందని ఆరోపించారు. ఆస్తులతో పాటు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిందన్నారు.
Also Read : America Shocking India : భారత్ పై అమెరికా సుంకాల రెట్టింపు
