Donald Trump : అమెరికా – అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. తాను త్వరలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తో కలుస్తానని వెల్లడించాడు. తాను ఎన్నికైన నాటి నుంచి కలవాలని అనుకుంటూనే వస్తున్నానని, కానీ సమయం సరి పోవడం లేదన్నారు. పలు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఇదే సమయంలో సుంకాలను విధించడం జరిగిందని చెప్పారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో ఏకంగా కిమ్ ను మూడుసార్లు కలిశాడు. అణ్వాయుధాలను కలిగి ఉన్నాడు కిమ్. తను ఎవరి మాట వినడు. తాను గనుక తల్చుకుంటే అమెరికాను నామ రూపాలు లేకుండా చేస్తానంటూ ప్రకటించాడు.
Donald Trump Key Comments
ఇదిలా ఉండగా తామిద్దరి మధ్య ఉన్న బంధం స్నేహ పూర్వకమైనదని పేర్కొన్నారు ట్రంప్. ఈ బంధం ఇలాగే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. బహుశా ఈ సంవత్సరం ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్‌తో మళ్ళీ కలవాలని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు, కానీ అది ఇబ్బందికరంగా మారిందన్నారు. అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ తన దీర్ఘకాలంగా ప్రణాళిక వేసిన మొదటి వైట్ హౌస్ సందర్శన కోసం రావడానికి కొన్ని గంటల ముందు ఈ కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. చైనాను నాశనం చేయడానికి అమెరికా వద్ద అద్భుతమైన కార్డులు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే తాను వాటిని ఇప్పుడు ఉపయోగించాలని అనుకోవడం లేదన్నారు. వేలాది మంది ఉత్తర కొరియా సైనికులను పోరాడటానికి పంపిన తర్వాత రష్యా నుండి కీలకమైన మద్దతును పొందాడు.
Also Read : Trump Fired on China : డ్రాగన్ చైనాపై నోరు పారేసుకున్న ట్రంప్
