Trump : అమెరికా – మరోసారి నోరు పారేసుకున్నారు అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ (Trump). చైనాను నాశనం చేయడానికి అమెరికా వద్ద అద్భుతమైన కార్డులు ఉన్నాయని అన్నారు. అయితే తాను వాటిని ఉపయోగించాలని అనుకోవడం లేదన్నారు. తాము చైనాతో గొప్ప సంబంధాన్ని కలిగి ఉండ బోతున్నామని ప్రకటించారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే చైనాను నాశనం చేయాలని తాము అనుకోవడం లేదన్నారు. దానిని నాశనం చేసే సత్తా తమ వద్ద ఉందన్నారు.
Trump Fired on China
అయితే చైనాకు కూడా కొన్ని కార్డులు ఉన్నాయని, కానీ అమెరికాతో చైనా కంటే ఎక్కువగా కార్డులు ఉన్నాయన్న విషయం మరిచి పోకూడదన్నారు. ఒకవేళ గనుక నేను ఆ కార్డులను ఆడితే, అది చైనాను నాశనం చేస్తుందన్నారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో జరుగుతున్న చర్చలను ప్రతిబింబించేలా పరస్పర సుంకం రేట్లను మరింత సవరించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశాడు. మా ఆర్థిక సంబంధంలో వాణిజ్య పరస్పరం లేకపోవడం, జాతీయ, ఆర్థిక భద్రతా సమస్యలను పరిష్కరించడానికి చైనాతో చర్చలు కొనసాగుతున్నందున ఈ చర్య అవసరమని ట్రంప్ అన్నారు. ట్రంప్ మళ్ళీ భారతదేశం-పాక్ యుద్ధాన్ని ఆపినట్లు పేర్కొన్నారు . తాజాగా ట్రంప్ చేసిన కామెంట్స్ పై చైనా సీరియస్ అయ్యింది. తాము తల్చుకుంటే అమెరికా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : PM Modi Strong Focus : రక్షణ సంబంధాల బలోపేతంపై ఫోకస్
