చెన్నై : తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళి సై సౌందర రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాష్ట్రంలో డిఎంకే పార్టీకి చెందిన మాజీ మంత్రి అనితా రాధాకృష్ణన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా తన అరెస్ట్ పై స్పందించారు. ఆయన మొదటి నుంచి పూర్తిగా అహంకార పూరితంగా వ్యవహరిస్తూ వచ్చారని అన్నారు. అధికారం అన్నది శాశ్వతం కాదని ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
అనితా రాధాకృష్ణన్ అత్యంత అహంకారంతో దూషించేలా మాట్లాడారని ఇది ఎవరూ హర్షించరని అన్నారు చెన్నైలో తమిళి సై సౌందర రాజన్ మీడియాతో మాట్లాడారు. ఆయన ముఖ్యమంత్రిని విమర్శించడమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా దూషించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ముందు నుంచి డిఎంకే పార్టీ నైజంగా ఉంటూ వస్తోందన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పేనని అన్నారు. రాజకీయాలు అన్నాక విమర్శలు సహజమేనని, కానీ పూర్తిగా వ్యక్తిత్వాలను కించ పరిచేలా ఉండ కూడదని పేర్కొన్నారు తమిళి సై సౌందర రాజన్.
సామాజిక వేదికలపైన గానీ, సోషల్ మీడియాలో గానీ… తమ ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు వారు చాలా తప్పుడు, అవమానకరమైన, అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటారని పేర్కొన్నారు. ఇది డీఎంకే డీఎన్‌ఏ (DNA)లోనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు, అందుకే నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయంగా చూస్తే, ఒక ప్రత్యర్థిని వ్యతిరేకించాలని అనుకున్నప్పుడు సభ్యతతో కూడిన భాషను ఉపయోగించాలని స్పష్టం చేశారు.



















