Sukumar : దమ్మున్న దర్శకుడిగా పేరు పొందాడు సుకుమార్ (Sukumar). తను బన్నీతో తొలుత ఆర్య తీశాడు. ఇది లవ్ స్టోరీ. బిగ్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత ఆర్య -2 సీక్వెల్ తీశాడు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత పుష్ప -1 తీశాడు ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీ రోల్ పోషించింది. మైత్రీ మూవీ మేకర్స్ కు కాసుల పంట పండించేలా చేసింది. అద్భుతమైన కథ, అంతకు మించిన సన్నివేశాల చిత్రీకరణ. ఆకట్టుకునేలా డైలాగులు. తగ్గేదేలే అన్న డైలాగ్ ఊపేసింది. ఆ మేనరిజం బన్నీని స్టార్ హీరోగా, ఐకాన్ స్టార్ గా మార్చేలా చేసింది. దీనికి సీక్వెల్ ఉందని ప్రకటించాడు. కానీ జనం నమ్మలేదు. ఊహించని రీతిలో పుష్ప -2 తీశాడు. దీనిని ప్రేక్షకుల మీదకు వదిలాడు. దేశ వ్యాప్తంగా,వరల్డ్ వైడ్ గా బిగ్ సక్సెస్ ను అందుకుంది. ఏకంగా రూ. 1867 కోట్లు కొల్లగొట్టింది.
Director Sukumar Gives Key Update on Pushpa 3
భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా పుష్ప -2 రికార్డ్ సృష్టించింది. అంతకు ముందు అమీర్ ఖాన్ నటించిన చిత్రం పై ఈ రికార్డు ఉంది. ఇదిలా ఉండగా తాజాగా దుబాయ్ వేదికగా సైమా అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డులలో అత్యధిక పురస్కారాలు పుష్ప -2 మూవీకి దక్కాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కు అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ ప్రసంగించారు. పుష్ప -3 సీక్వెల్ ఉంటుందా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. అందరూ విస్తు పోయేలా త్వరలోనే పుష్ప సీక్వెల్ తప్పక ఉంటుందని ప్రకటించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులంతా పండుగ చేసుకుంటున్నారు. ఎంతైనా సుకుమారా మజాకా అంటున్నారు.
Also Read : CM Revanth Reddy New Innovation : రేపే కీలక ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన



















