Director Anil Ravipudi Warning : మెగాస్టార్ న‌య‌న్ మూవీ ప్రాజెక్టు లీక్స్ పై ఫైర్

ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి

Hello Telugu - Director Anil Ravipudi Warning

Hello Telugu - Director Anil Ravipudi Warning

Anil Ravipudi : ప్ర‌ముఖ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి, ద‌క్షిణాది లేడీ అమితాబ్ గా పేరు పొందిన న‌య‌న‌తార క‌లిసి న‌టిస్తున్న మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. కేర‌ళ‌లో చిత్ర బృందం ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). అయితే ఈ సినిమాపై కొన్ని లీక్స్ ఇటీవల అందరికీ షాకిచ్చాయి.

Anil Ravipudi Serious Comments

చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మెగాస్టార్ 157 సినిమా షూటింగ్ సెట్స్ నుంచి బయటకి వచ్చిన విజువల్స్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు చెబుతున్నారు. తమ బ్యానర్ లో ఈ సినిమాని ఎంతో శ్రమించి ప్రతిష్టాత్మకంగా తెర కెక్కిస్తున్నామని సో ఎవరైనా లీక్స్ ని షేర్ చేసినా లేక కావాల‌ని బ‌య‌ట పెట్టినా న్యాయ ప‌రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

ఇక ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ను బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ ను ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌కెక్కించాడు. ఈ ఏడాది వ‌చ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం బిగ్ స‌క్సెస్ గా నిలిచింది. ఇందులో మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్, విక్ట‌రీ వెంక‌టేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఏకంగా రూ. 300 కోట్లు వ‌సూలు చేసింది. సినీ వ‌ర్గాలను విస్మ‌యానికి గురి చేసింది. భీమ్స్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. కామెడీ జోన‌ర్ లో నిర్మించిన ఈ మూవీ రికార్డుల‌ను తిర‌గ రాసింది. వెంకీ సినీ కెరీర్ లో బిగ్ హిట్ మూవీగా నిలిచింది.

Also Read : Hero Pawan – Hari Hara Veera Mallu : 23న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ప్రీమియ‌ర్ షోస్

Exit mobile version