ఆ చిత్రం మ‌ధుర‌మైన జ్ఞాప‌కం

న‌టి కాజోల్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

hellotelugu-Kajol

బాలీవుడ్ న‌టి కాజోల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌ను బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో క‌లిసి న‌టించిన చిత్రం దిల్ వాలే దుల్హానీ లేజాయింగే మూవీ విడుద‌లై నేటికి 10 ఏళ్లు పూర్త‌వుతోంది. ఈ సంద‌ర్బంగా ఆనాటి షూటింగ్ జ్ఞాప‌కాల‌ను మ‌రోసారి గుర్తు చేసుకుంది న‌టి. గురువారం సామాజిక మాధ్య‌మం ఎక్స్ వేదిక‌గా త‌న అభిప్రాయాన్ని పంచుకుంది. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోల‌ను కూడా షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. నిజంగా కాలం ఎంత విచిత్రం క‌దూ. చూస్తూ ఉండ‌గానే ప‌ది సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయంటే తాను న‌మ్మ‌లేక పోతున్నాన‌ని తెలిపింది.

నాతో పాటు నా స‌హ‌చ‌ర న‌టుడు షారుక్ ఖాన్ తో క‌లిసి చేసిన ఈ మూవీ త‌న సినీ కెరీర్ లో అత్యుత్త‌మంగా నిలిచేలా చేసింద‌ని పేర్కొంది కాజోల్. ఈ సినిమా చేసే స‌మ‌యంలో ఎన్నో ఇబ్బందులు ప‌డ్డాం. ద‌ర్శ‌కుడు మాతో సీన్స్ చేయించే స‌మ‌యంలో మ‌మ్మ‌ల్ని త‌ను అనుకునే సీన్స్ వ‌చ్చేంత వ‌ర‌కు నానా తిప్ప‌లు పెట్టినా ఆ చిత్రం రిలీజ్ అయ్యాక సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఓ ప్ర‌భంజ‌నం సృష్టించింది. సినిమా స‌క్సెస్ అయ్యేందు కోసం ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించారు నిర్మాత‌లు. వారి ప్ర‌య‌త్నం ఫ‌లించింది. అంత‌కు మించి ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ప్ర‌తి ఫ్రేమ్ లో ఉట్టి ప‌డేలా చేయ‌డంతో మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. సెట్ లో చేసిన జోకులు, స‌ర‌దా స‌న్నివేశాలు, వెర‌సీ మూవీ రిలీజ్ అయ్యాక వ‌చ్చిన స‌క్సెస్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొంది.

https://www.youtube.com/watch?v=cNV5hLSa9H8

Exit mobile version