Diabetes : ఆయుర్వేదం కేవలం వ్యాధులను నయం చేయడమే కాదు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ఎలా అనుసరించాలో స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తుంది. ప్రస్తుత కాలంలో చిన్నవారు – పెద్దవారు అనేకమంది మధుమేహం (డయాబెటిస్) తో బాధపడుతున్నారు. దీన్ని నియంత్రించేందుకు ఆహారం, ఔషధాలు, జీవనశైలి అనే మూడు ముఖ్యమైన అంశాలు అనుసరించడం తప్పనిసరి అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Diabetes – ఆహారం ప్రాముఖ్యత
మధుమేహం (Diabetes) ఉన్నవారికి ఆహారం చాలా కీలకం. ఆయుర్వేదం ప్రకారం నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
- తృణ ధాన్యాలు & చిరుధాన్యాలు: బార్లీ, గోధుమ, పాత బియ్యం, సజ్జలు, జొన్నలు వంటివి ఆహారంలో ఉండాలి. ముఖ్యంగా బార్లీ బరువును తగ్గించడంలో, రక్తంలో షుగర్ పెరగకుండా నిలుపడంలో సహాయపడుతుంది.
- చేదు రుచులు: కాకరకాయ, వేప, తులసి, ఉసిరి, మెంతి వంటి పదార్థాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి.
- పండ్లు: నేరేడు, బొప్పాయి లాంటి పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. నేరేడు పండ్లు స్టార్చ్‌ను చక్కెరగా మారకుండా నిరోధిస్తాయి.
ఔషధ మూలికలు
- మధుమేహ (Diabetes) నియంత్రణలో సహజసిద్ధమైన ఔషధ మూలికలకు కీలక స్థానం ఉంది.
- మెంతులు, వేప, పసుపు, ఉసిరి, దాల్చిన చెక్క వంటి మూలికలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
- ఇవి శరీరాన్ని బలోపేతం చేయడంతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
జీవనశైలి మార్పులు
- ఆహారం, ఔషధాల సరసన ఆరోగ్యకర జీవనశైలి అలవాటు చేసుకోవడం మధుమేహ నియంత్రణలో కీలకం.
- వ్యాయామం: రోజూ 30 నిమిషాల నడక, యోగా లేదా ఈత వంటి వ్యాయామాలు ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతాయి.
- నిద్ర: రోజుకు 7–8 గంటల నిద్ర అవసరం. తక్కువ నిద్ర వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరిగి చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
- ఒత్తిడి తగ్గింపు: ధ్యానం, శ్వాసాభ్యాసాలు ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యానికి తోడ్పడతాయి.
ఏం తగ్గించుకోవాలి?
- కొవ్వు పదార్థాలు, వేయించినవి, చల్లని ఆహారాలు, పాలు మరియు పాల ఉత్పత్తులు, మైదా పదార్థాలు, తీపి పదార్థాలు మధుమేహులకు హానికరం.
- ఎల్లప్పుడూ తాజాగా, వేడిగా వండిన ఆహారమే జీర్ణక్రియకు మేలు చేస్తుంది.
నిపుణుల అభిప్రాయం:
ఆయుర్వేదం సూచించిన ఈ మూడు సూత్రాలు – సరైన ఆహారం, సహజ ఔషధాలు, సమతుల్య జీవనశైలి – పాటిస్తే మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. దీంతో పాటు, ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read : Maruti New Innovation : 40 కిలోమీటర్ల మైలేజీతో మరో కొత్త కారును తీసుకొస్తున్న మారుతి సంస్థ



















