Dhwajasthambha Renovation Interesting : లక్ష్మీ న‌ర‌సింహ‌ ఆల‌యంలో ధ్వ‌జ స్తంభ జీర్ణోద్ద‌ర‌ణ

శాస్త్రోక్తంగా త‌రిగొండ శ్రీ ల‌క్ష్మీ ఆలయంలో

hellotelugu-dhwajasthambha

Dhwajasthambha : తిరుపతి – అన్న‌మ‌య్య జిల్లా త‌రిగొండ‌ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజస్వంభ (Dhwajasthambha) జీర్ణోద్ధరణ చేపట్టారు. వేకువ జామున స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి, నివేదన, బలిహరణ, తోరణ ధ్వజ కుంభ ఆరాధనం, మూలవర్లకు అభిషేకం, అలంకరణ, హోమం నిర్వహించారు.

Dhwajasthambha Renovation

అనంతరం ప్రాణ ప్రతిష్టా హవనం, మహా పూర్ణాహుతి, నివేదన, ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, అగ్ని కుండ ప్రదక్షణ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహా నివేదన, గర్భ గుడి లోకి ప్రవేశం, ధ్వజస్తంభం జీర్ణోద్ధరణ, ఆచార్య మర్యాద, తీర్థప్రసాద గోష్టి చేపట్టారు.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఆధ్వ‌ర్యంలో శ్రీ లక్ష్మి న‌ర‌సింహ స్వామి ఆల‌యంలో ధ్వ‌జ స్తంభ జీర్ణోద్ద‌ర‌ణ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇందులో భాగంగా ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించారు టీటీడీ అధికారులు.

టిటిడి ఆగమ సలహాదారులు కాండూరి శ్రీనివాసాచార్య స్వామి ఆధ్వర్యంలో పాంచరాత్ర ఆగమోక్తంగా ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కంకణ భట్టర్ కె. ధనుష్ భట్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వ‌ర‌ల‌క్ష్మీ, అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా తిరుమ‌ల పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కొన‌సాగుతోంది. శ్రీ‌వారిని 70 వేల 353 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 25 వేల 636 మంది త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.65 కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు తెలిపారు ఈవో జె. శ్యామ‌ల రావు. స్వామి ద‌ర్శ‌నం కోసం 6 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, ఎలాంటి టోకెన్లు లేని భ‌క్తుల‌కు క‌నీసం 8 గంట‌ల‌కు పైగా ప‌డుతుంద‌న్నారు.

Also Read : RBI Shocking : 2 వేల నోట్లపై కీలక అప్డేట్ ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్

Exit mobile version