Srisailam : నంద్యాల జిల్లా : కార్తీక పౌర్ణమి సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో (Srisailam) వెలసిన శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టవంతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాలమేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ .యుగంధర్ బాబు శ్రీశైలంలో పర్యటించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
Huge Devotees Visit Srisailam
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మాట్లాడుతూ శ్రీశైలంలో జరిగే జ్వాలాతోరణం కార్యక్రమం సందర్బంగా భద్రత ఏర్పాట్లు పరిశీలించడం జరిగిందన్నారు. భక్తులు వెళ్ళే క్యూ లైన్ లు, పార్కింగ్ ప్రదేశాలు, దేవాలయ పరిసరప్రాంతాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ పరిశీలించామన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ముఖ్యమైన కూడళ్ళులో సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. పాతాలగంగ మెట్ల మార్గం తదితర ప్రదేశాలను కూడా చూశామన్నారు. పుణ్య స్నానాలు ఆచరించే ప్రదేశాలలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని సూచించామన్నారు. భక్తులు పోలీసు హెచ్చరికలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతంలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు.
Also Read : Sanju Samson-Gambhir Sensational : సంజూ శాంసన్ పై కక్ష కట్టిన గంభీర్
