అమరావతి : ఏపీలో సీఎం, స్పీకర్ లు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 15వ ఆర్ధిక సంఘం నిధులు నియోజకవర్గాల వారీగా పంచాయతీలకు ఎంత మొత్తం విడుదల చేశామన్న అంశాన్ని కూడా బుక్ లెట్ లో పొందుపరిచినట్లు తెలిపారు. కూటమి పక్షాల ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా వైసీపీ విజయం సాధించిన 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు చేసిన కేటాయింపులకు కూడా పుస్తకరూపం ఇచ్చామన్నారు.
నియోజకవర్గం నర్సీపట్నం పరిధిలో రూ. 312 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. పల్లెపండగ 1.0కి రూ. 36.21 కోట్లు, పల్లెపండగ 2.0 ద్వారా రూ. 58.85 కోట్లు ఖర్చు చేసి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్స్ తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద రూ. 43.83 కోట్లతో పనులు చేపట్టినట్టు, 15వ ఆర్ధిక సంఘం నిధులు మరో రూ. 173.53 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. మలి ప్రతిని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. తెనాలి నియోజకవర్గం పరిధిలో మొత్తం రూ. 168 కోట్లుతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. అందులో పల్లెపండగ 1.0 కింద రూ. 3.80 కోట్లతో 37 సీసీ రోడ్లు, 44 గోకులాలు, 4 ఫారం పాండ్స్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు తెలిపారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్ లో జనసేన ఎమ్మెల్యేలకు ప్రతులు అందజేశారు.
చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలో రూ.487 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు పవన్ కళ్యాణ్ శాఖల ద్వారా చేపట్టారు. అందులో పల్లెపండగ 1.0 ద్వారా రూ. 46.71 కోట్లు ఖర్చు చేశారు. పల్లెపండగ 2.0కి రూ. 138 కోట్లు, జల్ జీవన్ మిషన్ పనులకు రూ. 7.12 కోట్లు వెచ్చించారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ. 185.89 కోట్లు ఆ నియోజకవర్గ పరిధిలో పంచాయతీలకు బదిలీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి మరో రూ. 110 కోట్లు ఇచ్చారు.
