న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాని మోదీని ఏకి పారేశారు. బిల్లులపై మోదీ చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ మీడియాతో మాట్లాడారు. 2027 జనగణన తర్వాత డీలిమిటేషన్ జరగాలన్నారు. కానీ తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం 16,17,18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టారన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకం కాదన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
మహిళా రిజర్వేషన్ల బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని చెప్పారు. 2024 తర్వాత మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు ఎంపీ. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమిపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోంని ఆరోపించారు. మేం మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదన్నారు.. డీలిమిటేషన్ కు మాత్రమే తాము అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. డీలిమిటేషన్ చేయాలంటే అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. కానీ బీజేపీ , కేంద్ర సర్కార్, మోదీ, అమిత్ షా ద్వయం పూర్తిగా కుట్ర పూరితంగా వ్యవహరించారని ఆరోపించారు.
