ఢిల్లీ : ఏఐసీసీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి కోలుకోలేని ఝలక్ ఇచ్చింది ఢిల్లీ కోర్టు. విచిత్రం ఏమిటంటే ఇవాళ ఆమె పుట్టిన రోజు. సంతోషకరమైన ఈ సమయంలో ఉన్నట్టుండి కోర్టు నోటీసు పంపించడం విస్తు పోయేలా చేసింది. ఓటర్ జాబితాలో సోనియా పేరుపై కోర్టులో పిటిషన్ దాఖలైంది.
పౌరసత్వం రాక ముందే ఓటర్ జాబితాలో పేరు ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని సోనియా గాంధీకి రాస్ ఎవెన్యూ కోర్టు స్పస్టం చేసింది జారీ చేసిన నోటీసులో. సోనియా గాంధీ పేరు ఓటర్ల జాబితాలో చేరడంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ చేపట్టింది ఢిల్లీ కోర్టు .
ఈ మేరకు మీపై ఎందుకు కేసు నమోదు చేయకూడదో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ 1980లో ఓటర్ల జాబితాలో తన పేరు కనిపించిందని – ఆమె భారత పౌరసత్వం పొందే మూడు సంవత్సరాల ముందు ఎలా సాద్య అవుతుందని పిటిషనర్ తన పిటిషన్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కాగా ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను పరిశీలించడానికి ఢిల్లీ కోర్టు మంగళవారం అంగీకరించింది. సీనియర్ న్యాయవాది పవన్ నారంగ్ సోనియా గాంధీ పేరును ఓటరు జాబితాలో చేర్చడానికి పత్రాలను ఫోర్జరీ చేసి సమర్పించినట్లు అర్థం అవుతోందని పేర్కొన్నారు పిటిషనర్ .
















