ముంబై : బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే మరోసారి నోరు పారేసుకున్నారు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో తను మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది నటుడు ప్రభాస్ గురించి. నేను ఇటీవల ఒక దక్షిణాది సినిమా నుంచి తప్పుకున్నానని చెప్పింది. ఎందుకంటే అందులో కథానాయకుడికి నాకంటే ఎక్కువ పారితోషికం ఇస్తున్నారని ఆరోపించింది. నేను కూడా అంతే మొత్తం అడిగాను, కానీ వారు ఇవ్వలేక పోయారని మండిపడింది. ఆ సినిమా పేరు స్పిరిట్. దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు వంగా సందీప్ రెడ్డి.
ఈ సందర్భంగా తనకు ప్రభాస్ తో పాటు పారితోషకం ఎందుకు ఇవ్వడం లేదంటూ దర్శకుడు, నిర్మాతలను నిలదీశానని అన్నారు దీపికా పదుకొనే. ఇలా అడిగితే కథానాయికకు చెల్లించేంత బడ్జెట్ లేదని వారు సమాధానమిచ్చారని పేర్కొన్నారు. ఇది ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన విషయం అన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ఆ నటుడి కంటే నేనే ఎక్కువ విజయవంతమైన నటిని అని మరోసారి బాంబు పేల్చారు దీపికా పదుకొనే. ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాను, అందుకే నేను ఆ పారితోషికం అడిగాను అని అన్నారు.
ఇదిలా ఉండగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీపికా పదుకొనే తన పారితోషికంతో పాటు సినిమా లాభాల్లో 10% వాటా కూడా అడిగారని చెప్పారు. దీపికా పదుకొనేకు నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే. ప్రభాస్ అన్నకు, మీకు ఉన్న తేడా ఇదే అని ఆరోపించారు. ఒక ప్రాజెక్ట్ పట్ల మీకు ఆయనకున్నంత నిబద్ధత లేదన్నారు.. అందుకే మీరు ‘కల్కి’ (Kalki) సినిమా నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారని పేర్కొన్నారు.


















