Rashmika Mandanna : వంగా సందీప్ రెడ్డి, దీపికా పదుకొనే మధ్య చోటు చేసుకున్న వివాదం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కేవలం పని గంటల విషయంలోనే ఈ ఇద్దరికీ పొసగలేదు. దీంతో తను దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం స్పిరిట్. ఇందులో కీలక పాత్ర పోషించారు పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్రభాస్. అయితే మొదటగా దీపికా పదుకొనేను టచ్ చేశాడు దర్శకుడు. తను రూ. 20 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం, తనకు 60 రోజుల పాటు పూర్తి సమయం కేటాయించాలని కోరడం జరిగింది. దీనిపై అభ్యంతరం తెలిపింది నటి దీపికా పదుకొనే. ఆపై తను అంత సమయం కేటాయించే స్థితిలో లేనని ప్రకటించింది నటి.
Rashmika Mandanna Comments
దీంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. చివరకు దీపికా పదుకొనేను కాదని తను తీసిన , బ్లాక్ బస్టర్ గా నిలిచిన యానిమల్ మూవీలో ముఖ్య పాత్ర పోషించిన త్రిప్తి దిమ్రీని హీరోయిన్ గా ఎంపిక చేశాడు వంగా సందీప్ రెడ్డి. మొత్తంగా సినీ ఇండస్ట్రీలో నటి, దర్శకుడి మధ్య చోటు చేసుకున్న వివాదం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రముఖ నటి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చిట్ చాట్ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రష్మిక తన ఆలోచనలను పంచుకుంది, ప్రతి బృందంలో పని షెడ్యూల్లను చర్చించి నిర్ణయించు కోవాలని సూచించింది. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫ్లెక్సిబుల్ గంటల గురించి మాట్లాడుతున్నారు, కానీ అది వారికి ఏది బాగా పనిచేస్తుందో దాని ఆధారంగా టీం నిర్ణయం తీసుకోవాలని తాను నమ్ముతున్నట్లు చెప్పింది. ఇది తన వ్యక్తిగత ఎంపిక మాత్రమేనని స్పష్టం చేసింది.
Also Read : Hero Ranveer Singh-Sara Arjun : రణవీర్ సింగ్ ధురంధర్ లో సారా అర్జున్



















