Danam Nagender : న్యూఢిల్లీ : బీఆర్ఎస్ పార్టీ పేరుతో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ పై వేటు వేయాలని ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయనతో పాటు పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేశారు. మరో వైపు విచారణ కొనసాగుతూ ఉండగానే ఇంకో వైపు వారిపై వేటు వేయకుండా పార్టీ పరంగా ప్రయారిటీ ఇవ్వడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. వచ్చే నవంబర్ నెల 11న పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా పార్టీ పరంగా నవీన్ యాదవ్ ను బరిలోకి దించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున మాగంటి సునీతతో పాటు విష్ణు వర్దన్ రెడ్డిని ఆఖరులో నామినేషన్ వేయించారు. ఇక భారతీయ జనతా పార్టీ తరపున లంకాల దీపక్ రెడ్డిని బరిలోకి దించింది.
Danam Nagender AICC Star Campaign
ప్రస్తుతం పార్టీలన్నీ ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. విస్తృతంగా ర్యాలీలు చేపట్టాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం కోసం ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ స్టార్ క్యాంపెయినర్లను నియమించారు. ఇందులో ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) ను కూడా స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్టార్ కాంపెయినర్ గా నియమిస్తూ ఎన్నికల అధికారికి అఫీషియల్ నోట్ ను పంపింది ఏఐసీసీ జనరల్ సెక్రటరీ .బీఆర్ఎస్ పార్టీ నుండి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ పార్టీ ఫిరాయించాడు. దీనిపై పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
Also Read : MLC Balmoori Venkat Fired on KTR : కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి : బల్మూరి


















