హైదరాబాద్ : ప్రతిభావంతులైన దళిత విద్యార్థులు అన్ని రంగాల్లో సమాన లభించాలంటే చదువు ఒక్కటే మార్గామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు . గురువారం 59 దళిత కులాల సంఘాల నాయకులు లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ భవన్ ను , కాచిగూడ లోని ఎస్సీ హాస్టల్ ను సందర్శించారు. ఈ సందర్భంగామంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ ను మోడర్న్ కోచింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ప్రకటించారు.
కాచిగూడ హాస్టల్ కాంప్లెక్స్‌ను రెసిడెన్షియల్ అకాడమిక్ సెంటర్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్దంచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సివిల్స్ కోచింగ్ కోరకు తెలంగాణ విద్యార్ధులు ఢిల్లీ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పాడిందని చెప్పారు. దళిత విద్యార్ధులు ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కోచింగ్ తీసుకోవడం ఖర్చుతో కూడిన పని కావడంతో ఢిల్లీ స్థాయి సివిల్స్ కోచింగ్ సౌకర్యాలను హైదరాబాద్‌లోనే అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో విద్యార్ధుల కోసం కొత్త టెక్నాలజీతో డిజిటల్ లైబ్రరీలు, స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ గెస్ట్ లెక్చర్స్ తీసుకుంటామన్నారు. మాక్ టెస్టులు, ఇంటర్వ్యూ గైడెన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతామని తెలిపారు. కోచింగ్ తీసుకునే అభ్యర్ధుల కోసం హాస్టల్, మెస్, స్టడీ హాల్స్ వంటి పూర్తి సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.


















