CSK Interesting – Sanju Samson : సంజూ శాంస‌న్ ను తీసుకునేందుకు రెడీ – సీఎస్కే

మ‌హేంద్ర సింగ్ ధోనీ స్థానంలో త‌నే క‌రెక్ట్

Hello Telugu - CSK Interesting - Sanju Samson

Hello Telugu - CSK Interesting - Sanju Samson

Sanju Samson : హైద‌రాబాద్ – భార‌తీయ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ను తీసుకునేందుకు తాము ఆస‌క్తి చూపిస్తున్నామ‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం అధికారికంగా ధ్రువీక‌రించింది. వ‌చ్చే ఏడాదిలో జ‌రిగే ఐపీఎల్ కోసం వేలం పాట‌లో త‌ప్ప‌కుండా త‌న‌ను తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో దాదాపు త‌న చేరిక ఖ‌రారైన‌ట్టేన‌ని క్రీడా వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మ‌రో వైపు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో సుదీర్ఘ కాలంపాటు ప్రాతినిధ్యం వ‌హించాడు శాంస‌న్ (Sanju Samson). స్కిప్ప‌ర్ గా ఆ జ‌ట్టును సెమీస్ దాకా తీసుకు వెళ్లాడు.

CSK Interested to take Sanju Samson

మ‌రో వైపు సీఎస్కేకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారి పోయాడు ఝార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌నకు వ‌య‌సు మీద ప‌డుతుండ‌డంతో మెంటార్ గా జ‌ట్టుకు సేవ‌లు అందించేందుకు ఛాన్స్ ఉంది. గ‌త కొన్నేళ్లుగా త‌మిళులు మొత్తం ధోనీని త‌మ తాలా (నాయ‌కుడు)గా భావిస్తూ వ‌చ్చారు. దేశంలో త‌న‌కు ఉన్నంత క్రేజ్ ఏ ఇండియ‌న్ క్రికెట‌ర్ కు లేదంటే అతిశ‌యోక్తి కాదు.

ఇదే స‌మ‌యంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ఐకాన్ గా మారి పోయాడు సంజూ శాంస‌న్. కానీ ఎందుక‌నో ఈ ఏడాది 2025లో జ‌రిగిన ఐపీఎల్ లో త‌ను ఎక్కువ మ్యాచ్ లు ఆడ‌లేదు. ఎప్పుడైతే రాహుల్ ద్ర‌విడ్ రాజ‌స్థాన్ కు కోచ్ గా వ‌చ్చాడో త‌ను శాంస‌న్ ను ప‌క్క‌న పెట్టడం, యాజ‌మాన్యంతో శాంస‌న్ కు పొస‌గ‌క పోవ‌డం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. ఎంఎస్ ధోనీ త‌ర్వాత పెద్ద ఎత్తున జ‌నాద‌ర‌ణ క‌లిగిన క్రికెట‌ర్ గా త‌న‌కు గుర్తింపు ఉంది.

ఈ స‌మ‌యంలో ధోనీ త‌ర్వాత చాలా ప్ర‌యోగాలు చేసింది సీఎస్కే మేనేజ్మెంట్. కానీ ఎవ‌రూ ఆ స్థాయిలో జ‌ట్టును న‌డిపించ‌లేక పోతున్నారు. త‌న స్థానాన్ని భ‌ర్తీ చేసే ఆట‌గాళ్ల‌లో టాప్ లో సంజూ శాంస‌న్ త‌ప్ప‌క ఉంటాడ‌ని భావిస్తోంది సీఎస్కే. ఈ త‌రుణంలో త‌న‌ను తీసుకునేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తోంది. త‌ప్ప‌కుండా ఎంత ధ‌ర‌కైనా చెల్లించేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌ని అధికారికంగా ధ్రువీక‌రించింది.

Also Read : Beauty Komalee Prasad : శ్వాస ఉన్నంత వ‌ర‌కు న‌టిస్తూనే ఉంటా

Exit mobile version