Telugu Film : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో షూటింగ్ లు ఆగి పోయాయి. సినీ కార్మికులు సమ్మె బాట పట్టారు. తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపింది సినీ నిర్మాతలతో. ఈ సమయంలో ఆందోళన బాట పట్టిన సినీ కార్మికులపై నోరు పారేసుకున్నారు నిర్మాత విశ్వ ప్రసాద్ (TG Viswa Prasad). ఇక్కడి వారికి టాలెంట్ లేదంటూ చేసిన కామెంట్స్ తో సినీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమలో టాలెంట్ లేక పోతే ఇన్నేళ్ల పాటు సినిమాలు ఎలా సక్సెస్ అయ్యాయో చెప్పాలన్నారు. రోజు రోజుకు హైదరాబాద్ లో బతకాలంటే ఇచ్చే వేతనాలు సరిపోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు సమ్మె బాట పట్టారు.
Telugu Film Workers Strike
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సినీ కార్మికులకు 30 శాతం జీతాలు పెంచాలని డిమాండ్ చేసింది. నిర్మాతలు వేతనాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ పరిశ్రమ ఆర్థిక మాంద్యం దృష్ట్యా సమయం సరికాదని వాదిస్తున్నారు. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, తదితర నటులు ఒక్కో మూవీకి రూ. 80 నుంచి రూ. 120 కోట్ల దాకా వసూలు చేస్తారు. ప్రముఖ దర్శకులు ఒక్కో మూవీకి కనీసం రూ. 25 కోట్ల నుంచి రూ. 40 కోట్ల దాకా పారితోషకం తీసుకుంటారు. ఇక నటీమణులు ఐటెం సాంగ్కు రూ. 1 కోటి తీసుకుంటారు. అయితే సినిమాలలో ముఖ్య పాత్ర పోషించే సినీ కార్మికులకు రోజుకు కేవలం రూ. 1250 నుండి రూ. 3,500 వరకే చెల్లిస్తున్నారు.
అయితే నిర్మాతల వెర్షన్ వేరుగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాణ ఖర్చు పెరిగిందని, దశల వారీగా పెంచేందుకు చూస్తామని పేర్కొన్నారు నిర్మాత ప్రసాద్. ఈ మొత్తం వ్యవహారంలో చిరంజీవి, బాలకృష్ణలతో చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది.
Also Read : Popular Actress Rekha : ఆ పాటను ఎన్నటికీ మరిచి పోలేను – రేఖ



















