అక్రమ న‌ల్లా క‌నెక్ష‌న్‌దారుల‌పై క్రిమిన‌ల్ కేసులు

జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశాల‌తో ఎఫ్ఐఆర్

hellotelugu-FIRFile

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో అక్ర‌మ న‌ల్లా క‌నెక్ష‌న్ దారుల‌పై ఉక్కుపాదం మోపుతోంది జ‌ల‌మండ‌లి సంస్థ‌. ఈ మేర‌కు పెద్ద ఎత్తున దాడులు చేప‌డుతోంది. ప‌లు చోట్ల అక్ర‌మ న‌ల్లా క‌నెక్ష‌న్లు ఉన్న‌ట్లు గుర్తించింది. ఇందులో భాగంగా అక్రమ నల్లా కనెక్షన్ దారులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝళిపించారు. జలమండలి సరఫరా చేస్తున్న పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ పొందిన పందొమ్మిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ నం. 6 (ఎస్ ఆర్ నగర్), తట్టిఖనా సెక్షన్ పరిధిలో ఇటీవల జిహెచ్ఎంసీ నూతన రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఇదే అదునుగా. కాలనీకి చెందిన పందొమ్మిది మంది అధికారుల అనుమ‌తులు లేకుండా వారే స్వంతంగా మొత్తం 19 అక్రమ న‌ల్లా కనెక్ష‌న్ తీసుకున్నారు.

ఈ విష‌యాన్ని గుర్తించిన జ‌ల‌మండ‌లి విజిలెన్స్ విభాగం ఎండీ సూచనలతో అక్ర‌మ న‌ల్లా క‌నెక్ష‌న్‌ను తొల‌గించ‌డంతో పాటు అక్ర‌మ‌ క‌నెక్ష‌న్ తీసుకున్న 19 మందిపై కేసు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జలమండలి నుంచి అనుమతి లేకుండా ఎవరైనా అక్రమంగా తాగునీటి నల్లా, సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్లు తీసుకుంటే.. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామనిహెచ్చరించారు.

ఎవరైనా అక్రమ నల్లా సీవరేజ్ కనెక్షన్లు గుర్తిస్తే జలమండలి విజిలెన్స్ బృందానికి 9989998100, 9989987135 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం ఇవ్వాల‌ని కోరారు. స‌మాచారం ఇచ్చిన వారి పేర్ల‌ను గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు ఎండీ.

Exit mobile version