పంజాబ్ : కేరళ క్రికెటర్, ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరో సంజు శాంసన్ పై ప్రశంసలు కురిపించాడు యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ తండ్రి . కష్ట సమయాల్లో తనకు అండగా నిలిచాడని పేర్కొన్నాడు. జాతీయ మీడియాతో మాట్లాడాడు అభిషేక్ శర్మ తండ్రి. నేను సంజును కలిసిన ప్రతిసారీ,సంజు భాయ్, అభిషేక్ పరిస్థితి ఏంటి?’ అని అడిగేవాడిని అన్నాడు . అందుకు అతను ఎప్పుడూ ఇలా బదులిచ్చేవాడు: ‘అంకుల్, మీరు చింతించకండి. అతను చాలా గొప్ప ఆటగాడు. అతను కేవలం ఆడటమే కాదు, ఆధిపత్యం కూడా చెలాయిస్తాడని నమ్మకంతో చెప్పాడు. రాబోయే కాలంలో అభిషేక్ శర్మ భారతదేశానికి విజయాలు సాధించి పెడతాడని, ఇందులో ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదని తనకు భరోసా కల్పించాడని తెలిపాడు.
అప్పుడు నేను అతనితో, ‘ధన్యవాదాలు సంజు. నువ్వు ఇంత నమ్మకంతో, ఇంత ఆప్యాయతతో మాట్లాడే తీరు చూస్తుంటే నేను నీకు అభిమానినై పోయాను అని చెప్పానని అన్నాడు అభిషేక్ శర్మ తండ్రి. అందుకు సంజు శాంసన్ జోక్యం చేసుకుంటూ ‘కాదు, కాదు పాజీ విషయం అది కాదు,’ అని బదులిచ్చాడు. కానీ అభిషేక్ సామర్థ్యంపై అతనికి ఉన్న నమ్మకాన్ని మీరు స్పష్టంగా చూడవచ్చు. సంజు శాంసన్ నిజంగా ఒక గొప్ప ఆటగాడు అని కితాబు ఇచ్చాడు. అతనిలాంటి ఆటగాళ్లు చాలా అరుదుగా దొరుకుతారని అన్నాడు. పైగా అతనికి అవకాశం దొరికిన ప్రతిసారీ, తన స్థాయిని ఇప్పటికే నిరూపించు కున్నాడని, తాను తనను మరిచి పోలేనంటూ పేర్కొన్నాడు అభిషేక్ శర్మ తండ్రి.



















