Jemima Rodrigues Shocking Comments : భార‌త దేశంలో క్రికెట్ ఓ మ‌తం – జెమీమా రోడ్రిగ్స్

భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం

Hello Telugu - Jemima Rodrigues Shocking Comments

Hello Telugu - Jemima Rodrigues Shocking Comments

Jemima Rodrigues : ముంబై : ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ను చేజిక్కించుకున్న భార‌త జ‌ట్టుకు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. టీం వైఎస్ కెప్ట‌న్ స్మృతీ మంధాన‌, జెమీమా రోడ్రిగ్స్ తో పాటు రాధను ఘ‌ణంగా స‌న్మానించారు సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ . ఈ సంద‌ర్బంగా భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఏకంగా ఏపీకి చెందిన క్రికెట‌ర్ శ్రీ చ‌ర‌ణికి రూ. 2.50 కోట్లు న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించారు. దీంతో పాటు 1000 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లం, గ్రూప్ -1 ఉద్యోగం ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రో వైపు సీఎం ఫ‌డ్న‌వీస్ సైతం భారీ ప్రోత్సాహ‌కాన్ని ప్ర‌క‌టించారు. స‌న్మానం అనంత‌రం క్రికెట‌ర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemima Rodrigues) మీడియాతో మాట్లాడారు. ప్ర‌పంచ క‌ప్ విజ‌యంలో కీల‌క‌మైన పాత్ర పోషించినందుకు చెప్ప‌లేనంత ఆనందంగా ఉంద‌ని తెలిపింది.

Jemima Rodrigues Comments

త‌మ‌కు ఈ విజయం భారతదేశానికి భారీ విజయాన్ని చేకూరుస్తుందని తాను భావిస్తున్న‌ట్లు చెప్పింది. ఇది మాకు అవసరమైన ప్రోత్సాహం మాత్రమే. బీసీసీఐ ద్వారా వస్తున్న వేతన సమానత్వం, ఉమెన్ ప్రిమీయ‌ర్ లీగ్ ద్వారా కూడా వ‌స్తోంద‌న్నారు. దీని ద్వారా దేశ వ్యాప్తంగా మ‌హిళా క్రికెట్ కు రోజు రోజుకు ఆద‌ర‌ణ పెరుగుతోంద‌న్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ దేశంలో క్రికెట్ అంటే ఓ మ‌తం అని అన్నారు జెమీమా రోడ్రిగ్స్. పేరెంట్స్ మారాలి. త‌మ పిల్ల‌ల‌ను క్రికెట్ లో ఆడించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని కోరారు . దీని వ‌ల్ల వారిలో మ‌రింత ఆత్మ విశ్వాసం పెరుగుతుంద‌ని చెప్పింది జెమీమా రోడ్రిగ్స్.

Also Read : PM Modi New Innovation -Vande Bharat : నాలుగు కొత్త వందే భార‌త్ రైళ్లు స్టార్ట్

Exit mobile version