CPI Narayana : విజయవాడ : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీ లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మూడు పార్టీలు గల్లీలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట చేస్తాయంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ వాళ్లు బీజేపీకి భయపడి బతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో అంటకాగిన వారు ఎవరూ బాగు పడ లేదన్నారు. రేపు టీడీపీ, జనసేన పార్టీలను కూడా బీజేపీ రెండుగా చీల్చుతుందంటూ హెచ్చరించారు. శనివారం సీపీఐ నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన ఆ మూడు పార్టీలు తమ అస్తిత్వాన్ని కోల్పోయాయని పేర్కొన్నారు.
CPI Narayana Slams
ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని ఇది పూర్తిగా అధ్వాన్నమని ఆవేదన వ్యక్తం చేశారు నారాయణ. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఆచరణకు నోచుకోని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపి కూటమి పాలనా పరంగా పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ , ఎన్డీయే బీజేపీ సర్కార్ ఇన్నేళ్లుగా దేశానికి ఏం చేసిందో చెప్పాలని అన్నారు. బడా బాబులు, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చేలా వ్యవహరిస్తూ వచ్చారని ఆరోపించారు. మొన్నటి దాకా జీఎస్టీ జపం చేశారని ఇప్పుడు మరోసారి సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ధ్వజమెత్తారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ వస్తున్న మోదీకి, ఆయన పరివారానికి పాలించే నైతిక హక్కు లేదన్నారు.
Also Read : CM Revanth Reddy Strong Focus : విద్యా రంగం బలోపేతంపై ఫోకస్ : సీఎం

















