డీఎంకే పాల‌న‌లో పెచ్చ‌రిల్లిన అవినీతి

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-APCM

త‌మిళ‌నాడు : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో పాల‌న సాగిస్తున్న డీఎంకే స‌ర్కార్ ను ఏకి పారేశారు. పెద్ద ఎత్తున అవినీతి, అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని, పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త లోపించింద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో కొన‌సాగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌చ‌న‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా తల్లి ప్రాంతంలో జరిగిన ఉత్సాహభరిత సభలో సీఎం పాల్గొన్నారు. ఆయ‌న‌తో పాటు కేంద్ర మంత్రులు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ తో పాటు కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు హాజ‌ర‌య్యారు.

కుటుంబ రాజ‌కీయాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయ‌ని, దీనిని త‌మిళ‌నాడు రాష్ట్ర ప్ర‌జ‌లు ఒప్పుకోర‌ని పేర్కొన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్ర‌జ‌లు సుస్థిర‌త‌, అభివృద్ది గురించి ఆలోచిస్తార‌ని అన్నారు. పెచ్చ‌రిల్లిన అవినీతిని చూసి త‌ట్టుకోలేక పోతున్నార‌ని అన్నారు. ఏదో ఒక రోజు ప్ర‌జ‌లు డిఫ‌రెంట్ గా ఆలోచిస్తున్నార‌ని చెప్పారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అభివృద్ధి అజెండాతో NDA వైపు ప్రజలు దృఢంగా నిలుస్తున్నారని , ఈ విష‌యం తాను ప్ర‌జ‌ల‌ను చూసినప్పుడు క‌లిగింద‌ని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశారంటూ డీఎంకే పాల‌న‌పై భ‌గ్గుమ‌న్నారు . ఇది ప్ర‌జ‌ల‌కు భారంగా మారింద‌న్నారు.

Exit mobile version