టిప్పు సుల్తాన్ పేరుతో చేసిన‌ దాడులు వెనుక కుట్ర‌

బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి

hellotelugu-SVisshnuVardhanReddy

అనంత‌పురం జిల్లా : బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌డ‌ప‌లో టిప్పు సుల్తాన్ పేరుతో చేసిన దాడుల వెనుక పెద్ద ఎత్తున కుట్ర కోణం దాగి ఉంద‌ని ఆరోపించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఘటనపై పూర్తి స్థాయి, పారదర్శక దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. కేర‌ళ‌కు చెందిన ఎస్డీపీఐ, పీఎఫ్ఐ నిషేధిత సంస్థ‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. ఈ దాడులు , కుట్రలో నిషేదిత మత సంస్థల ప్రమేయంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలన్నారు. సంఘటనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్, ప్రణాళిక అంశాలను పరిశీలించాలని అన్నారు ఎస్. విష్ణు వ‌ర్ద‌న్ రెడ్డి.

శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. కుట్రలో పాల్గొన్న వారికి మద్దతుగా కొంద‌రు రాజకీయ జోక్యం చేసుకోవడం పై కూడా విచార‌ణ జ‌రిపించాల్స‌ని అవ‌స‌రం ఉంద‌న్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ తగల బెట్టిన వారిపై విచారణ జరపాలన్నారు. సంఘటన వెనుక ఉన్న కుట్ర కోణం, ప్రేరేపణలు, ఆర్థిక, కమ్యూనికేషన్ లింకులను దర్యాప్తు చేయాలన్నారు ఎస్. విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి. ప్రజా ఆస్తుల ధ్వంసం చేయ‌డం, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం కట్టడి చేయాలన్నారు. కర్నూలు జిల్లాలో ఆత్మకూరు పోలీసులు స్టేషన్ కేసును మూసివేసిన పోలీసు అధికారులపై విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేక‌పోతే తాము తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సి వ‌స్తుంద‌న్నారు ఎస్. విష్ణువ‌ర్ద‌న్ రెడ్డి.

Exit mobile version