ఏపీ సీఎం చంద్రబాబు ప‌నితీరుకు క‌లెక్ట‌ర్లు ఫిదా

బిజినెస్ రిఫార్మర్ అవార్డు సాధించిన బాబు

అమరావతి : బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ – 2025 అవార్డు సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ అభినందనలు తెలిపింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబుకు మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మంత్రులు, సీఎస్ మొదలుకుని గ్రామ స్థాయి అధికారి వరకు పని చేయడం వల్లే ఈ అవార్డు దక్కింది అని అన్నారు. .బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం మనందరి సమిష్టి కృషి వ‌ల్లే వ‌చ్చింద‌ని చెప్పారు. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడారు..? ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దానికి ఈ అవార్డు ఒక ఉదాహరణగా నిలుస్తుంద‌ని చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు.

గతంలో ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి ఇష్టపడే వాడిని కాద‌ని అన్నారు. కానీ ఇప్పుడు ఇలాంటి అవార్డులు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను అని ప్ర‌క‌టించారు సీఎం. ఎన్ని అవార్డులు వస్తే… మన రాష్ట్రానికి అంత గుర్తింపు దక్కుతుందని , ఆ విష‌యం గుర్తించి ముందుకు వెళ్లాల‌ని, ప్ర‌జ‌ల‌తో మ‌మేకం కావాల‌ని, నిజాయితీ, నిబద్ద‌త‌తో, బాధ్యతాయుతంగా ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు నారా చంద్ర‌బాబు నాయుడు. మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు. అందుకే మరిన్ని అవార్డులను మనం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు సీఎం. ఈ అవార్డును టీమ్ ఏపీకి అంకితం చేస్తున్నాను అని ముఖ్యమంత్రి చెప్పారు.

Exit mobile version