న్యూఢిల్లీ : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసన ఆదివారం నాటితో 16వ రోజుకు చేరుకుంది. ఇదిలా ఉండగా ప్రముఖ పర్యావరణ, ప్రజాస్వామిక వేత్త సోనమ్ వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష ఎనిమిదవ చ రోజుకు చేరుకుంది. రోజు రోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో సీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. తనకు ఏమైనా జరిగితే మోదీ సర్కారే బాధ్యత వహించాలని హెచ్చరించారు పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే.
ఇదిలా ఉండగా పరీక్షల నిర్వహణలో అవకతవకల ఆరోపణలపై ఆందోళన కొనసాగుతోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై ప్రభుత్వ జవాబు దారీతనాన్ని కోరుతూ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇక్కడి జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ నిరసన చేపట్టింది.
మరోవైపు, నిరాహార దీక్ష ప్రారంభించినప్పటి నుండి సుమారు ఆరు కిలోల బరువు తగ్గిన సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష కూడా ఎనిమిదవ రోజుకు చేరుకుంది. వైద్యులు విడుదల చేసిన ఆరోగ్య బులెటిన్ ప్రకారం, పడుకుని ఉన్న స్థితిలో వాంగ్‌చుక్ రక్తపోటు , గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 72 సార్లు ,రక్తంలో చక్కెర స్థాయి 67 mg/dLగా నమోదయ్యాయి. ఆయన శరీరంలో నీటి శాతం సంతృప్తికరంగా ఉందని, మానసికంగా చురుకుగా ఉన్నారని, అలాగే బరువు 60.95 కిలోలకు తగ్గిందని (ఏడు రోజుల్లో సుమారు ఆరు కిలోల తగ్గుదల) బులెటిన్ పేర్కొంది. పరీక్షల నిర్వహణలో పదేపదే జరుగుతున్న అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీలు విద్యార్థులు, వారి కుటుంబాల జీవితాలను ఛిన్నాభిన్నం చేశాయని ఆరోపించింది.
